Nokia C32 Launch : కేవలం రూ. 8,999కే నోకియా C32 ఫోన్.. ఫ్రీ రీప్లేస్మెంట్ పాలసీ కూడా.. ఇప్పుడే కొనేసుకోండి..!
Nokia C32 Launch : ప్రముఖ నోకియా C32 ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 8,999గా ఉంది. ఈ డివైజ్ ఏడాది ఉచిత రీప్లేస్మెంట్ పాలసీతో వస్తుంది.

Nokia C32 launched with 1 year free replacement policy, India price starts at Rs 8,999
Nokia C32 Launched India Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? నోకియా C32 భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 8,999గా ఉంది. ఈ డివైజ్ 5,000mAh బ్యాటరీ, 6.5-అంగుళాల డిస్ప్లే, IP రేటింగ్‌తో గ్లాస్ బ్యాక్ డిజైన్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి మరిన్ని ఫీచర్లను అందించనుంది. వాస్తవానికి, 4G స్మార్ట్‌ఫోన్, సరికొత్త Android OSతో వస్తుంది. నోకియా C2 ఫోన్ ఒక ఏడాది ఉచిత రీప్లేస్మెంట్ పాలసీతో వస్తుంది. మీరు కొనుగోలు చేసిన తర్వాత ఏడాది వరకు ఏదైనా హార్డ్‌వేర్ లేదా మ్యానిఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉంటే నోకియా మీకు కొత్త బ్రాండ్-న్యూ డివైజ్ అందిస్తుంది. నోకియా C32 కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా మీ సమీప రిటైల్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. లేటెస్ట్ నోకియా ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నోకియా C32 ఫోన్ ధర ఎంతంటే? :
కొత్తగా లాంచ్ చేసిన నోకియా C32 ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. 4GB RAM, 128GB స్టోరేజ్ వెర్షన్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ధర రూ.9,499కు అందుబాటులో ఉంది. నోకియా 4G ఫోన్లో బ్యాంక్ కార్డ్ ఆఫర్లు లేవని గమనించాలి. బడ్జెట్ డివైజ్ చార్కోల్, బ్రీజీ మింట్ లేదా బీచ్ పింక్‌తో సహా మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
నోకియా C32 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే :
కొత్తగా లాంచ్ అయిన నోకియా C32 HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ప్రామాణిక 60Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. ఈ ప్యానెల్‌కు 2.5D గ్లాస్ లేయర్ కలిగి ఉంది. నోకియా ఫోన్ లాంగ్ లైఫ్ పనిచేయగలదని కంపెనీ పేర్కొంది. ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ చుట్టూ మెటాలిక్ ఫినిషింగ్ ఉంటుంది.

Nokia C32 launched with 1 year free replacement policy
కొత్త నోకియా ఫోన్ అదనపు ప్రయోజనం ఏమిటంటే… IP52 రేట్‌తో వచ్చింది. ఫొటోగ్రఫీ, వీడియోల విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరా, మాక్రో షాట్లకు 2MP కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 8MP సెన్సార్ ఉంది. నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, ఆటో HDR వంటి కెమెరా మోడ్లు ఉన్నాయి. 1080p వీడియోలను షూట్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది.
నోకియా C32 హుడ్ కింద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్సెట్ 3 రోజుల బ్యాటరీ లైఫ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. మీరు ఫోన్‌తో పాటు రిటైల్ బాక్స్‌లో 10W ఛార్జర్‌ని పొందవచ్చు. కంపెనీ 4G ఫోన్లో ఒక కేసును కూడా అందిస్తుంది. నోకియా ఫోన్ 3.5mm హెడ్‌ఫోన్‌ను కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. నోకియా ఈ డివైజ్ రెండు ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్లను స్వీకరిస్తుందని తెలిపింది.