Nokia PureBook: నోకియా నుంచి 16జీబీ ర్యామ్‌తో ల్యాప్‌టాప్
ఇండియన్ మార్కెట్లో కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు రీసెంట్గా నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్, కొత్త నోకియా స్మార్ట్ టీవీ సిరీస్ మోడళ్లను లాంచ్ చేసింది.

Nokia Laptop
Nokia PureBook: ఇండియన్ మార్కెట్లో నోకియా బ్రాండ్‌కు ఉన్న నమ్మకం వేరు. స్టాండర్డ్ ప్రొడక్ట్‌గా పేరు సంపాదించుకున్న నోకియా.. కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు రీసెంట్గా నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ల్యాప్‌టాప్, కొత్త నోకియా స్మార్ట్ టీవీ సిరీస్ మోడళ్లను లాంచ్ చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ పార్టనర్షిప్తో మంగళవారం లాంచింగ్ చేసింది. అక్టోబర్ 3 నుంచి ఈ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 ఈ ల్యాప్‌టాప్‌లో 11 జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. నోకియా స్మార్ట్ టీవీ మోడల్స్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సహాయంతో పనిచేస్తాయి. ఇవి 50, 55 అంగుళాల డిస్ప్లే పరిమాణాలలో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌టీవీలు ఫుల్ హెచ్డీ, అల్ట్రా హెచ్డీ, క్యూఎల్ఈడీ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
ధర ఏంతంటే…?
నోకియా ప్యూర్‌బుక్ ఎస్14 ల్యాప్‌టాప్ ధర రూ.56వేల 990.
– నోకియా 50అంగుళాల అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 44వేల 999. అల్ట్రా హెచ్డీ 4కే క్యూఎల్ఈడీ ధర రూ. 49వేల 999గా నోకియా నిర్ణయించింది.
– నోకియా 55ఇంచ్ అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్‌టీవీ ధర రూ. 49వేల 999. అల్ట్రా హెచ్డీ 4కే క్యూఎల్ఈడీ ధర రూ. 54వేల 999గా నోకియా నిర్ణయించింది.
– ఈ స్మార్ట్ టీవీ సెట్లు జేబీఎల్ స్పీకర్స్‌తో పనిచేస్తుండగా.. 2జీబీ ర్యామ్ + 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానున్నాయి.
…………………………………..: అమెరికా 250 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..సిక్కు మెరైన్‌కు తలపాగా ధరించే అవకాశం..
నోకియా ప్యూర్‌బుక్ ఎస్ 14 స్పెసిఫికేషన్స్
* విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
* బరువు 1.4 కిలోలు
* 11 జెన్ ఇంటెల్ కోర్ i5 CPU
* డాల్బీ అట్మోస్ సపోర్ట్
* 14-అంగుళాల ఫుల్-హెచ్డి ఐపిఎస్ డిస్ప్లే
* 16జీబీ ర్యామ్ + 512జీబీ NVMe ఎస్ఎస్డీ
* యూఎస్బీ టైప్-సి, హెచ్డీఎమ్ఐ పోర్టులు