Nokia X100: నోకియా 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. బడ్జెట్‌ ధరలోనే అందుబాటులోకి!

స్మార్ట్​ఫోన్​ ప్రపంచంలో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది నోకియా.

Nokia X100: నోకియా 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. బడ్జెట్‌ ధరలోనే అందుబాటులోకి!

Nokia 5g

Nokia X100: స్మార్ట్​ఫోన్​ ప్రపంచంలో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది నోకియా. ఈ క్రమంలోనే ప్రీమియం ఫీచర్లతో 5జీ స్మార్ట్​ఫోన్‌ని లాంఛ్​ చేసింది. సి సిరీస్, జి సిరీస్​తో పాటు ఎక్స్​ సిరీస్​లో మొత్తం ఆరు కొత్త స్మార్ట్​ఫోన్లను ప్రవేశపెట్టింది సంస్థ. నోకియా ఎక్స్100 పేరుతో స్మార్ట్ ఫోన్ అమెరికాలో అందుబాటులోకి తీసుకుని వచ్చింది. 5జీ ఫీచర్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో.. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో ఫోన్‌ను తీసుకుని వచ్చింది నోకియా.

ర్యామ్​, స్టోరేజ్​ సామర్థ్యాలను బట్టి చూస్తే ఇది 6 జీబీ + 128 కాన్ఫిగరేషన్లలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర విషయానికి వస్తే.. ఇది 252 యుఎస్ డాలర్లు.. భారత కరెన్సీలో సుమారు రూ.18,700 వద్ద లభించనుంది. మిడ్‌నైట్ బ్లూ కలర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 19వ తేదీ నుంచి ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

నోకియా ఎక్స్100 స్పెసిఫికేషన్లు:
1. నోకియా ఎక్స్100 మోడల్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 20: 9 నిష్పత్తిని కలిగి ఉంటుంది.
2. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్​తో పనిచేస్తుంది.
3. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
4. 15 జీబీ గూగుల్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్
5. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మైక్రో SD) స్లాట్​తో వస్తుంది.
6. ఆండ్రాయిడ్​ 11 ఆపరేటింగ్​ సిస్టమ్​తో పనిచేస్తుంది.
7. కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో 48MP LED ఫ్లాష్‌ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్​, 2MP మాక్రో కెమెరాలను చేర్చింది. కాగా, సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం దీనిలో ప్రత్యేకంగా 16MP ఫ్రంట్​ కెమెరాను అందించింది.
8. సైడ్ -మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను చేర్చింది.
9. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్‌ఎం రేడియోలను అందించింది.
10. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా చూస్తే.. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, USB Type-C వంటివి ఇందులో ఉన్నాయి.
11. 18W ఛార్జింగ్ సపోర్ట్​తో కూడిన 4470 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. బరువు 217 గ్రాములుగా ఉంది.

Padma Shri: దేశవ్యాప్తంగా కంగనా పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్