Nokia XR20 స్మార్ట్‌ఫోన్‌.. నీళ్లలో పడినా పనిచేస్తుంది.. అక్టోబర్ 20నుంచి బుకింగ్స్!

నోకియా అత్యంత శక్తివంతమైన 5G స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకుని వస్తోంది.

Nokia XR20 స్మార్ట్‌ఫోన్‌.. నీళ్లలో పడినా పనిచేస్తుంది.. అక్టోబర్ 20నుంచి బుకింగ్స్!

Nokia

Nokia XR20 pre-booking: నోకియా అత్యంత శక్తివంతమైన 5G స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి తీసుకుని వవస్తోంది. కిందపడినా పాడవ్వని, నీళ్లలో వేసినా పనిచేసే నోకియా ఎక్స్ఆర్20 (Nokia XR20) స్మార్ట్‌ఫోన్ గురించి కంపెనీ ప్రకటించినప్పటి నుంచి టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

మిలిటరీ గ్రేడ్ వాటర్ ప్రూఫ్ సామర్థ్యంతో తయారైన ఈ స్మార్ట్‌ఫోన్.. నోకియా తయారు చేయగా.. ఈ మొబైల్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

లేటెస్ట్‌గా ఈ ఫోన్‌ ప్రీ బుకింగ్స్‌కి సంబంధించిన డేట్‌ని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ అక్టోబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో బుక్ చేసుకున్నవారికి ఇయర్ బడ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఈమేరకు నోకియా సంస్థ ఓ ప్రకటన చేసింది. నోకియా XR-20 ప్రత్యేకతలు చూస్తే వాటర్‌ప్రూఫ్, షాక్‌ప్రూఫ్ బాడీతో స్మార్ట్‌ఫోన్ తయారైంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఉన్న రగ్డ్‌ కేస్‌కు మిలిటరీ గ్రేడ్ మన్నిక ఉంది. నోకియా XR-20 స్మార్ట్‌ఫోన్ 1.8 మీటర్ల ఎత్తు నుంచి పడినా ఏం కాదు. నీటిలో ముంచినా ఏం కాదు. వాటర్‌ప్రూఫింగ్ కోసం ఐపీ68 సర్టిఫికెట్ ఉంది. ఈ ఫోన్‌కి స్మార్ట్ ఫోన్ కేస్ కూడా అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది. ఫోన్ స్క్రీన్ ప్రొటెక్షన్‌లో ఇదే డ్యూరబుల్ గ్లాస్.

ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో విడుదలవ్వగా.. ఇండియాలో 4జీబీ+64జీబీ ధర రూ.43,600 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హైఎండ్ వేరియంట్ 6జీబీ+128జీబీ ధర రూ.50,600 ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రానైట్, అల్‌ట్రా బ్లూ కలర్స్‌లో రిలీజ్ అయింది.

నోకియా ఎక్స్ఆర్20 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు నాలుగేళ్ల పాటు మంత్లీ సెక్యూరిటీ అప్‌డేట్స్, మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్స్ లభిస్తాయని గతంలోనే నోకియా ప్రకటించింది.

నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరాలు ZEISS టెక్నాలజీతో పనిచేస్తాయి. సెల్ఫీలు, వీడియోల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. స్టీరియో స్పీకర్లకు ఓజో ఆడియో సపోర్ట్ చేస్తుంది.