Nothing Phone (1) : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్లు.. నథింగ్ ఫోన్ (1)పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బెనిఫిట్స్.. ఇంకా తక్కువ ధరకే పొందాలంటే?

Nothing Phone (1) : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో స్మార్ట్‌ఫోన్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. రూ. 25,000 లోపు మిడ్-రేంజ్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? నథింగ్ ఫోన్ (1)పై ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది.

Nothing Phone (1) : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో స్మార్ట్‌ఫోన్లపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. రూ. 25,000 లోపు మిడ్-రేంజ్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? నథింగ్ ఫోన్ (1)పై ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తోంది. కార్ల్ పీ నేతృత్వంలోని నథింగ్ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు నథింగ్ ఫోన్ (1)ని రూ. 25,999 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.కానీ, బ్యాంక్ ఆఫర్‌లతో, నథింగ్ ఫోన్ ఇంకా తక్కువ ధరకు పొందవచ్చు. నథింగ్ ఫోన్ (1) 2022లో భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ నాన్-ఆఫ్-ది మిల్ డిజైన్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. దాంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నథింగ్ ఫోన్ (1) ఫుల్ డిమాండ్ పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ అందించే ఆఫర్లలో నథింగ్ ఫోన్ (1) డీల్ ఎలా పనిచేస్తుందో ఓసారి లుక్కేయండి.

నథింగ్ ఫోన్‌ (1)లో డీల్ :
ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1) ధర రూ. 25,999 వద్ద లిస్టు అయింది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో నథింగ్ ఫోన్ (1) రూ. 25వేల లోపు కొనుగోలు చేయవచ్చు. మీరు ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్ అయితే.. మీరు డివైజ్‌పై రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 20వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత iPhone 12 ఎక్స్ఛేంజ్ చేసినా కూడా రూ. 20వేలకు దగ్గరగా రాదు. Flipkart ఆఫర్లలో ఆపిల్ iPhone 12లో రూ. 6వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు మీ ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్ట విలువ రూ.10వేల వరకు తగ్గింపు పొందవచ్చు. చివరిగా.. నథింగ్ ఫోన్ (1) ధర రూ.14,000లకు సొంతం చేసుకోవచ్చు.

Nothing Phone (1) can be bought for under Rs 25,000 on Flipkart

Read Also : Nothing Phone (1) Sale : ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,499కే నథింగ్ ఫోన్ (1) సొంతం చేసుకోవచ్చు.. క్యాష్‌‌బ్యాక్, మరెన్నో డిస్కౌంట్లు!

నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్‌లు ఇవే :
నథింగ్ ఫోన్ (1) 6.55-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లే హై రిఫ్రెష్ రేట్ 120Hz, హాప్టిక్ టచ్ మోటార్లు, HDR10+, ఫ్రంట్, బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్‌తో వస్తుంది. నథింగ్ ఫోన్ 4500mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. మీరు బాక్స్ లోపల ఛార్జర్ పొందలేరు. ఈ డివైజ్ Qualcomm Snapdragon 778+ SoC 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. మొత్తం మూడు వేరియంట్‌లు ఉన్నాయి. 8GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM + 256GB స్టోరేజీ, 12GB RAM + 256GB స్టోరేజీని అందిస్తుంది. ఈ ఫోన్లలో స్టోరేజీ పెంచుకునే సపోర్టు లేదు. కెమెరా విభాగంలో నథింగ్ ఫోన్ (1) వెనుక ప్యానెల్‌లో 50-MP సోనీ IMX766 సెన్సార్‌తో పాటు 50-MP Samsung JN1 సెన్సార్‌ను కలిగిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఫ్రంట్ సైడ్ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల హోల్ పంచ్ డిస్‌ప్లే లోపల 16-MP ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరా యాప్‌లో మాక్రో, బ్యాక్ సైడ్ నైట్ మోడ్ వంటి వివిధ మోడ్‌లు ఉన్నాయి. నథింగ్ ఫోన్ Android 12లో NothingOS కస్టమ్ స్కిప్‌తో రన్ అవుతుంది. స్టాక్ Android ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ప్రతి 2 నెలలకు 3 ఏళ్ల ఆండ్రాయిడ్ సపోర్ట్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, మరెన్నో ఇతర ఫీచర్లు ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Nothing Phone (1) : ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20వేల లోపు ధరకే నథింగ్ ఫోన్ (1) సొంతం చేసుకోవచ్చు.. ఇలా ఆర్డర్ చేయండి!

ట్రెండింగ్ వార్తలు