Nothing Phone (1) : సరికొత్త టెక్నాలజీతో నథింగ్ ఫోన్ (1).. ఫీచర్లు చూస్తే ఫిదానే.. జూలై 21 నుంచే సేల్!

Nothing Phone (1) : సరికొత్త టెక్నాలజీతో నథింగ్ ఫోన్ (1).. ఫీచర్లు చూస్తే ఫిదానే.. జూలై 21 నుంచే సేల్!

Nothing Phone (1) Launched Top Specs, Features, India Price (2)

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లండన్ ఆధారిత కంపెనీ నుంచి సరికొత్త నథింగ్ ఫోన్ (1) వచ్చేసింది. జూలై 12న గ్లోబల్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ నథింగ్ ఫోన్ (1) సరికొత్త టెక్నాలజీతో వచ్చింది. చక్కటి డిజైన్‌తో, నథింగ్ ఫోన్ (1) చాలా కొత్తదనాన్ని అందించనుంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో లైటింగ్ స్ట్రిప్స్‌ను కలిగి ఉంది. ఇప్పటివరకు ఏ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇలా ప్రయత్నించలేదు. స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు అద్భుతంగా ఉన్నాయి. నథింగ్ ఫోన్ (1) 33W ఛార్జర్‌కు సపోర్టు ఇస్తుంది.

సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ నథింగ్ ఫోన్ (1)కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నథింగ్ బ్రాండ్ నుంచి మొదటి స్మార్ట్‌ఫోన్ కాగా.. మొత్తం 3 వేరియంట్‌లలో వైట్, బ్లాక్ సహా రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. నథింగ్ ఇయర్ (1) మాదిరిగానే.. నథింగ్ ఫోన్ (1) 900 LED లైట్లు, ఇంటర్నల్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 32,999 నుంచి రూ. 38,999 వరకు ఉంటుంది. జూలై 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (1) సేల్ ప్రారంభం కానుంది.

Nothing Phone (1) Launched Top Specs, Features, India Price (1)

Nothing Phone (1) Launched Top Specs, Features, India Price

Nothing Phone (1) specifications :

Display: నథింగ్ ఫోన్ (1) 60hz నుంచి120hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేతో వచ్చింది. ఫ్రంట్, బ్యాక్ HDR10+ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్‌తో వచ్చింది.

Processor: స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 778+ SoCతో పాటు 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రన్ అవుతుంది.

RAM: రెండు RAM వెర్షన్లలో వస్తుంది.. అందులో ఒకటి 8GB, రెండోది 12GB వెర్షన్.

Storage: 128GB, 256GB రెండు స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి.

Battery: 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4500mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. కానీ, రిటైల్ బాక్స్ ఛార్జింగ్ క్లియర్ కేస్‌తో రాదు. టైప్ C కేబుల్‌ ఉండదు.

Rear camera : ఈ ఫోన్ (1) వెనుక ప్యానెల్‌లో 50-MP Sony IMX766 సెన్సార్ + 50-MP Samsung JN1 సెన్సార్‌ను కలిగి ఉంది.

Front camera : సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం హోల్ పంచ్ డిస్‌ప్లే లోపల 16-MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Software : నథింగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 12లో నథింగ్‌ OS కస్టమ్ స్కిప్‌తో రన్ అవుతుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Nothing Phone (1) Launched Top Specs, Features, India Price

Nothing Phone (1) Launched Top Specs, Features, India Price

Nothing Phone (1) top features

ప్రతి 2 నెలలకు 3 ఏళ్లవరకు ఆండ్రాయిడ్ సపోర్ట్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని హామీ ఇస్తోంది.

సెక్యూరిటీ పరంగా.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.

నథింగ్ ఫోన్ (1)లో 900 LED లైట్లు ఉన్నాయి. కొత్త నోటిఫికేషన్, కాల్ లేదా మెసేజ్ లేదా ఈమెయిల్ వచ్చినప్పుడు వెలుగుతాయి.

నథింగ్ ఫోన్ (1) 10 గ్లిఫ్ శాంపిల్స్ అందిస్తుంది. నిర్దిష్ట కాంటాక్టుల కోసం నిర్దిష్ట రింగ్‌టోన్‌లను సెట్ చేసేందుకు వీటిని ఉపయోగించవచ్చు.

స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12OSతో పాటు నథింగ్‌OS స్కిన్‌తో వస్తుంది.

NothingOS స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. యాడ్స్ లేదా బ్లోట్‌వేర్‌తో రాలేదు.

కెమెరా యాప్‌లో స్టూడియో లైట్, గ్లిఫ్ లైట్ మోడ్ ఉన్నాయి. పరిమిత లైటింగ్‌లో కూడా వినియోగించవచ్చు.

Nothing Phone (1) Launched Top Specs, Features, India Price (3)

Nothing Phone (1) Launched Top Specs, Features, India Price

Nothing Phone (1) price in India : 

నథింగ్ ఫోన్ (1) మూడు వేరియంట్‌లలో వస్తుంది. ఇందులో బేస్ మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 32,999, 8GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్‌లతో సహా ఇతర రెండు మోడల్‌లు వరుసగా రూ. 35,999, రూ. 38,999 ధరలకు అందుబాటలో ఉండనున్నాయి. నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్‌తో భాగస్వామ్యంతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్  అందిస్తోంది. కానీ, నథింగ్ ఫోన్‌ (1)ను ప్రీ-ఆర్డర్ చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్ కార్ట్‌లో జూలై 21 నుంచే ఓపెన్ సేల్ :

ఫోన్ (1) ఓపెన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 21న రాత్రి 7PM నుంచి ప్రారంభం కానుంది. ఫోన్ ఆఫ్‌లైన్లో సేల్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్‌లను అందించనుంది. కంపెనీ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్‌లు ఫోన్‌ను ప్రారంభ ధర రూ. 31,999 (8GB RAM + 128GB స్టోరేజ్), రూ. 34,999 (8GB RAM + 256GB స్టోరేజ్), రూ. 37,999 (12GB RAM, 256GB స్టోరేజ్)కు సొంతం చేసుకోవచ్చు.

Read Also : Nothing Phone (1) Launch Today : నథింగ్ ఫోన్ (1).. పేరులోనే నథింగ్.. ఈ ఫోన్‌లో ఎన్ని ఫీచర్లో.. అందుకే ఇంత క్రేజ్..!