Nothing Phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫస్ట్ లుక్ ఇదిగో.. కెమెరా ఫీచర్లు అదుర్స్..!

లండన్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. నథింగ్ ఫోన్ (1) మొదటి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్ అధికారికంగా రివీల్ చేసింది కంపెనీ.

Nothing Phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫస్ట్ లుక్ ఇదిగో.. కెమెరా ఫీచర్లు అదుర్స్..!

Nothing Phone (1) Officially Revealed First Look

Nothing Phone (1) : లండన్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. నథింగ్ ఫోన్ (1) మొదటి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్ అధికారికంగా రివీల్ చేసింది కంపెనీ. ఇప్పటివరకూ రాబోయే నథింగ్ ఫోన్ (1) డిజైన్‌ గురించి అధికారికంగా వెల్లడించలేదు. చివరకు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా అధికారిక పోస్టర్‌ను కంపెనీ వెల్లడించింది. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఫోన్ నథింగ్ ఇయర్ (1) తరహాలో ట్రాన్స్‌పరెన్సీ డిజైన్‌తో వస్తుందని ఇప్పటికే లీక్ డేటా వెల్లడించింది.

వెనుక కెమెరాల పక్కన.. కొత్త Apple iPhoneలలోని MagSafe ఫ్లాష్ మాదిరిగా పెద్ద సర్కిల్‌ ఉండటం గమనించవచ్చు. ఇతర స్పెసిఫికేషన్‌లు ఏమున్నాయి అనేది క్లారిటీ లేదు. ముందు ప్యానెల్‌ ఎలా ఉంటుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. నథింగ్ ఫోన్ (1) వైట్ ఫినిషింగ్ కాకుండా ఇతర కలర్ ఆప్షన్లను రివీల్ చేయలేదు. ప్రస్తుతానికి.. నథింగ్ ఇయర్ (1) వైట్, బ్లాక్ అనే రెండు షేడ్స్‌లో వస్తుంది. అయితే, ఇయర్‌బడ్‌లు ట్రాన్స్‌పరెన్సీ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. జూలై 12న రాత్రి 8:30 PM ISTకి నథింగ్ ఫోన్ (1) లాంచ్ చేయనుంది. నథింగ్ ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు. ఈ డివైజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది.

Nothing Phone (1) Officially Revealed First Look (1)

Nothing Phone (1) Officially Revealed First Look

స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 అని లీక్ డేటా తెలిపింది. ఇతర లీక్‌లు నథింగ్ ఫోన్ (1) EUR 500 ధర ఉండే అవకాశం ఉంది. మన కరెన్సీలో దాదాపు రూ. 41,500 వరకు ఉండవచ్చు. వన్‌ప్లస్, శాంసంగ్, ఆపిల్ వంటి బ్రాండ్‌ల కన్నా ఈ ఫోన్ భారత మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల FULL-HD+ OLED ప్యానెల్‌తో వస్తుందని అంచనా. వెనుక కెమెరా సెటప్ 50-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ప్యానెల్ 32-MP స్నాపర్‌ రావొచ్చు. నథింగ్ ఫోన్ (1) స్థానికంగా తమిళనాడు ప్లాంట్‌లో తయారు చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : Nothing Phone (1) : జూలై 12న నథింగ్ ఫోన్ (1) వస్తోంది.. తమిళనాడులోనే తయారీ..!