Nothing Phone (1) pre-orders : హాట్ కేకుల్లా అమ్ముడైన నథింగ్ ఫోన్ (1).. మళ్లీ ప్రీ-ఆర్డర్లు.. బుక్ చేసుకోండిలా..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో లాంచ్ కాగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మొదటి ప్రీ-ఆర్డర్ సేల్ సమయంలో నిముషాల్లోనే నథింగ్ ఫోన్ (1) స్టాక్ అయిపోయింది.

Nothing Phone (1) pre-orders : హాట్ కేకుల్లా అమ్ముడైన నథింగ్ ఫోన్ (1).. మళ్లీ ప్రీ-ఆర్డర్లు.. బుక్ చేసుకోండిలా..!

Nothing Phone (1) Pre Orders Open In India Once Again, Here’s How To Book It

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో లాంచ్ కాగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మొదటి ప్రీ-ఆర్డర్ సేల్ సమయంలో నిముషాల్లోనే నథింగ్ ఫోన్ (1) స్టాక్ అయిపోయింది. చాలా మంది ఆసక్తిగల కస్టమర్‌లు ఈ ఫోన్‌ను ముందస్తుగా బుక్ చేసుకోలేక నిరాశకు గురయ్యారు. ఆసక్తి గల కస్టమర్ల కోసం.. నథింగ్ ఇండియా ప్రెసిడెంట్ జనరల్ మేనేజర్ మను శర్మ నథింగ్ ఫోన్ (1) ప్రీఆర్డర్లను అందిస్తున్నట్టు తెలిపారు. జూలై 18న ఈరోజు (సోమవారం) సెకండ్ రౌండ్ ప్రీ-ఆర్డర్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సెకండ్ ప్రీ-ఆర్డర్ సేల్స్ బుకింగ్ మొదలయ్యాయని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

ఆసక్తిగల కొనుగోలుదారులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి నథింగ్ ఫోన్ (1)ని బుక్ చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ (1)ని త్వరగా బుక్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే స్టాక్ కేవలం నిమిషాల్లోనే స్టాక్ అయిపోతుంది. ఇప్పుడు, ప్రీ-ఆర్డర్ సేల్ వ్యవధిని జూలై 19 నుంచి జూలై 20 అర్ధరాత్రి వరకు పొడిగించారు. నథింగ్ ఫోన్ (1) జూలై 21న సాయంత్రం 7 గంటల నుంచి ఓపెన్ సేల్‌కు అందుబాటులో ఉంటుంది. కొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఆఫ్‌లైన్ లో నథింగ్ ఫోన్ (1) ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

Nothing Phone (1) Pre Orders Open In India Once Again, Here’s How To Book It (1)

Nothing Phone (1) Pre Orders Open In India Once Again, Here’s How To Book It 

భారత్‌లో నథింగ్ ఫోన్ (1) ధర తగ్గింపు :
నథింగ్ ఫోన్ (1) మూడు వేరియంట్లలో వస్తుంది. బేస్ మోడల్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 32,999 ధరకు వస్తుంది. రెండవ మోడల్ 8GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 35,999గా ఉంది. ఈ ఫోన్ మూడవ, టాప్-ఎండ్ మోడల్ 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ధర రూ. 38,999గా ఉంటుంది. నథింగ్ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ధరకు నథింగ్ ఫోన్ (1) అందిస్తున్నాయి. ఈ ఫోన్‌ను ప్రీ-బుక్ చేసే కస్టమర్లు రూ.31,999 ప్రారంభ ధరకు నథింగ్ ఫోన్ (1)ని పొందుతారు. ఈ ఫోన్ బేస్ మోడల్ ధర 8GB RAM +128GB స్టోరేజీతో వచ్చింది. ఇతర రెండు మోడల్స్ 8GB/256GB 12GB/256GB వరుసగా రూ. 34,999, రూ. 37,999 తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు రూ. 1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో నథింగ్ ఫోన్ (1) ధర మరింత తగ్గనుంది.

స్పెసిఫికేషన్‌లు :
నథింగ్ ఫోన్ (1) 6.55-అంగుళాల Full-HD+ 10-బిట్ OLED ప్యానెల్‌తో వస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. Qualcomm Snapdragon 778G+ చిప్‌సెట్‌తో పాటు గరిష్టంగా 12GB RAM 256GB స్టోరేజీతో వచ్చింది. స్టోరేజీ అప్‌గ్రేడ్ సపోర్టు చేయదు. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS రన్ అవుతుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,500mAh బ్యాటరీతో వస్తుంది. కానీ, బాక్స్‌లో ఛార్జర్ లేదు. రూ. 2499 ధరకు ఛార్జర్‌ను కొనుగోలు చేయాల్సిందే. కెమెరా ముందు భాగంలో 50-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 50-MP ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 16-MP షూటర్ కూడా ఆకర్షణీయంగా ఉంది.

Read Also : Nothing Phone (1) : సరికొత్త టెక్నాలజీతో నథింగ్ ఫోన్ (1).. ఫీచర్లు చూస్తే ఫిదానే.. జూలై 21 నుంచే సేల్!