Nothing Phone (1) : నథింగ్ ఫోన్ (1) నుంచి కొత్త OS 1.1.7 అప్‌డేట్.. నథింగ్ ఫోన్లలో బగ్ సమస్యలకు చెక్ పడినట్టే..!

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు నథింగ్ (Nothing) నుంచి నథింగ్ ఫోన్ (1) కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నథింగ్ OS 1.1.7 అప్‌డేట్‌ను అందిస్తోంది. నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ (Security Patch)తో పాటు కొన్ని అప్‌గ్రేడ్స్, బగ్ ఇష్యూలను ఫిక్స్ చేస్తుంది.

Nothing Phone (1) : నథింగ్ ఫోన్ (1) నుంచి కొత్త OS 1.1.7 అప్‌డేట్.. నథింగ్ ఫోన్లలో బగ్ సమస్యలకు చెక్ పడినట్టే..!

Nothing Phone (1) receives Nothing OS 1.1.7 update_ Here’s what’s new

Nothing Phone (1) : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు నథింగ్ (Nothing) నుంచి నథింగ్ ఫోన్ (1) కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నథింగ్ OS 1.1.7 అప్‌డేట్‌ను అందిస్తోంది. నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ (Security Patch)తో పాటు కొన్ని అప్‌గ్రేడ్స్, బగ్ ఇష్యూలను ఫిక్స్ చేస్తుంది. ఇంతకీ నథింగ్ ఫోన్ (1) అప్‌డేట్ ఫైల్ సైజ్ సుమారు 80MBగా ఉంటుంది.

ఇతర ఫీచర్లతో పాటు, అప్‌డేట్ ఎయిర్‌పాడ్‌ల కోసం బ్యాటరీ శాతం డిస్‌ప్లే సపోర్టును యాడ్ చేస్తుంది. ప్రయోగాత్మక ఫీచర్‌ల కింద డివైజ్ సెట్టింగ్‌ల యాప్‌లో ఫీచర్‌ని ఎనేబుల్ చేయవచ్చు. లేటెస్ట్ అప్‌డేట్ ద్వారా లాక్‌స్క్రీన్‌లో Whatsapp నోటిఫికేషన్‌లలోని బగ్ సమస్యను కూడా పరిష్కరిస్తుంది. నథింగ్ ఫోన్ (1) లో లేటెస్ట్ అప్‌డేట్‌తో వచ్చే ఫుల్ లిస్ట్ మీకోసం అందిస్తున్నాం.

New features :
* ఇప్పుడు AirPods కోసం బ్యాటరీ పర్సంటేజ్ డిస్ ప్లేకు సపోర్టు అందిస్తుంది. దీన్ని సెట్టింగ్‌లను ప్రయోగాత్మక ఫీచర్‌లలో ఎనేబుల్ చేయవచ్చు.

Improvements :
– అక్టోబర్ / నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌కి అప్‌డేట్ వచ్చింది.
– మెరుగైన OS ఫ్లూయిడిటీకి తగినట్టు మాట్లాడవచ్చు.
– వీడియోలను రికార్డ్ చేసేటప్పుడు మెరుగైన బ్యాలెన్స్ పనితీరు, టెంపరేచర్ మెరుగైన ఆడియో క్వాలిటీకి థర్మల్ థ్రెషోల్డ్‌ని అడ్జెట్ చేసింది.
– మరింత కచ్చితమైన బ్యాటరీ స్టేటస్ బగ్ పరిష్కారాలను కనుగొంది.

Nothing Phone (1) receives Nothing OS 1.1.7 update_ Here’s what’s new

Nothing Phone (1) receives Nothing OS 1.1.7 update_ Here’s what’s new

Bug Fixes :

– లాక్‌స్క్రీన్‌లో Whatsapp నోటిఫికేషన్‌లు రెస్పాండ్ కాకపోవడానికి కారణమయ్యే బగ్ కూడా ఫిక్స్ చేసింది.
– సాధారణ బగ్ పరిష్కారాలు

ఇంతలో, నథింగ్ ఫౌండర్, CEO కార్ల్ పీ ఇటీవల ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. నథింగ్ ఫోన్ (1) త్వరలో ఆండ్రాయిడ్ 13 బీటాను పొందవచ్చని సూచిస్తుంది. Android 13 ఆధారంగా రూపొందిన నథింగ్ OS 1.5.0 అప్‌డేట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.

నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్‌లు ఇవే :
నథింగ్ ఫోన్ (1) Qualcomm Snapdragon 778+ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చింది. వెనుకవైపు డ్యూయల్ 50 MP అధునాతన సెన్సార్‌లను కలిగి ఉంది. ప్రధాన కెమెరా ఫ్లాగ్‌షిప్ Sony IMX766 ద్వారా ఆధారితమైనది. ఈ ఫోన్‌లో నైట్ మోడ్, సీన్ డిటెక్షన్ కూడా ఉన్నాయి. 60Hz నుంచి 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లేతో వచ్చింది.

స్క్రీన్ HDR10+, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్ ద్వారా పనిచేస్తుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. వెనుకవైపు, డ్యూయల్ 50MP కెమెరా సెన్సార్లతో వచ్చింది. నథింగ్ ఫోన్ (1) ప్రతి ఛార్జ్‌తో 18 గంటల వరకు వినియోగాన్ని అందజేస్తుందని తెలిపింది. రెండు రోజులు స్టాండ్‌బైలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. కేవలం 30 నిమిషాల ఛార్జ్‌లో 0 నుంచి 50శాతం పవర్ వరకు ఛార్జ్ అవుతుందని చెప్పవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Fab Phones Fest : అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్.. కొత్త స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ఆఫర్లు.. ఏయే ఫోన్లపై డిస్కౌంట్ ఉందంటే?