Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?

నథింగ్ ఫోన్ (1) ఇండియాలో లాంచ్ ఈవెంట్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. ఇటీవలే నథింగ్ ఫోన్ డిజైన్‌ను రివీల్ చేసింది.

Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?

Nothing Phone (1) Will Feature Snapdragon 778g+ Soc, Here Is How Much It May Cost In India

Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఇండియాలో లాంచ్ ఈవెంట్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. అధికారిక లాంచింగ్ ముందే.. కంపెనీ హ్యాండ్‌సెట్ మరో కీలక ఫీచర్‌ను వెల్లడించింది. ఇటీవలే నథింగ్ ఫోన్ డిజైన్‌ను రివీల్ చేసింది. ఇప్పుడు, ఆ డివైజ్‌లో చిప్‌సెట్ గురించి ఫీచర్ రివీల్ చేసింది కంపెనీ. నథింగ్ ఫోన్ (1) క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుందని కంపెనీ CEO కార్ల్ పీ ధృవీకరించారు. మిడ్-రేంజ్ చిప్‌సెట్‌తో రానున్న ఈ నథింగ్ ఫోన్ (1) ధరను హై రేంజ్‌లో రిలీజ్ చేయనుంది. పవర్ ఫుల్ చిప్ మంచి పర్ఫార్మాన్స్ అందించగలదని Pei అంటున్నారు.

నథింగ్ ఫోన్ (1) వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ ఎక్కువగా రూ. 50,000 కన్నా ఎక్కువ ధర కలిగిన ఫోన్‌లలో మాత్రమే అందించనుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. దీనిని కంపెనీ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌గా పిలుస్తోంది. వెనుక ప్యానెల్ కూల్ లైట్ సిస్టమ్‌తో రానుంది. 900 LED వెనుకవైపు అమర్చారు. ఈ డివైజ్ నోటిఫికేషన్‌లు వచ్చిన సమయంలో బ్రైట్ రిప్రెష్ అవుతుంది.

Nothing Phone (1) Will Feature Snapdragon 778g+ Soc, Here Is How Much It May Cost In India (1)

Nothing Phone (1) Will Feature Snapdragon 778g+ Soc, Here Is How Much It May Cost In India 

ఈ డివైజ్ భారత మార్కెట్లో రూ. 30,000 ధర పరిధిలో ఉండే అవకాశం లేదు. లీక్‌ల ప్రకారం ఈ డివైజ్ $500 (సుమారు రూ. 39,500) కంటే తక్కువగా ఉండవచ్చని ఓ నివేదిక తెలిపింది. Passionate Geekz నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. రాబోయే నథింగ్ ఫోన్ ప్రారంభ ధర $397తో వస్తుందని అంటున్నారు. భారత్‌లో దాదాపు రూ. 31,300 వరకు ఉంటుందని అంచనా.

నథింగ్ ఫోన్ (1) అందించే ఫీచర్లలో రూ. 40,000 రేంజ్ ఉండవచ్చని అంటున్నారు. అదే ధరకు, కంపెనీ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ను ఆఫర్ చేయనుంది. 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర $419 (దాదాపు రూ. 33,000), 12GB + 256GB మోడల్‌కు $456 (సుమారు రూ. 35,900) ఉంటుందని లీక్ పేర్కొంది. నథింగ్ ఫోన్ (1) అధికారిక ధర ఎంత అనేది భారత మార్కెట్లో జూలై 12న రివీల్ చేయనుంది.

Read Also : Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్‌!