Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

ఆధార్ నెంబర్.. మీ బ్యాంకు అకౌంటుతో లింక్ అయిందా? ఎప్పుడైనా చేశారా? అయితే ఇప్పుడు చెక్ చేసుకోండి.. ఎందుకంటే.. బ్యాంకు ట్రాన్సాక్షన్లు చేయాలంటే ఆధార్ లింక్ అయి ఉండాలి.

bank account is linked to Aadhaar : ఆధార్ నెంబర్.. మీ బ్యాంకు అకౌంటుతో లింక్ అయిందా? ఎప్పుడైనా చేశారా? అయితే ఇప్పుడు చెక్ చేసుకోండి.. ఎందుకంటే.. బ్యాంకు ట్రాన్సాక్షన్లు చేయాలంటే పాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు మీ అకౌంటుకు లింక్ అయి ఉండాల్సిందే. గుర్తింపు కార్డుగా పరిగణించే ఆధార్ ద్వారా అనేక ప్రభుత్వ పథకాలు, ఇతర పనులు పూర్తి చేసుకోవచ్చు. సిమ్ కార్డు తీసుకున్నా ఆధార్ ఉండాల్సిందే. చాలామందికి తమ బ్యాంకుకు ఆదార్ కార్డు లింక్ అయిందో తెలియదు. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నగదు ఏమైనా మీ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ కావాలంటే ఆధార్ తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాల్సిందే. అప్పుడే మీ అకౌంట్లో పథకాల కింద డబ్బులు జమ అయ్య అవకాశం ఉంటుంది.
Child Pornography : ఆ వీడియోలు చూస్తున్నారా..అయితే..జైలుకే

ఇంతకీ ఈ ఆధార్ మీ బ్యాంకు అకౌంటుతో లింక్ అయిందా లేదో తెలుసుకుందాం.. మీ ఆధార్ నెంబ‌ర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో ఇలా సులభంగా తెలుసుకోవ‌చ్చు. ముందుగా మీరు చేయాల్సిందిల్లా.. https://uidai.gov.in/ వెబ్‌సైట్‌ విజిట్ చేయాలి. ఆధార్ కార్డుల‌ను జారీ చేసే UIDAI వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. అందులో మీకు Aadhaar Services అనే ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. మ‌రో పేజి డిస్‌ప్లే ఓపెన్ అవుతుంది. Aadhaar Linking Status ఆప్ష‌న్ ఉంటుంది. అందులోనే Check Aadhaar/Bank Linking Status లింక్ కూడా ఉంటుంది. ఆ లింకుపై క్లిక్ చేస్తే మ‌రో పేజి ఓపెన్ డిస్ ప్లే అవుతుంది.

ఆధార్ నెంబ‌ర్ లేదా వ‌ర్చువ‌ల్ ఐడీ ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ కోడ్ టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ (Send OTP) బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి. మీరు ఎంట‌ర్ చేసిన ఆధార్ నెంబ‌ర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబ‌ర్‌కు OTP వ‌స్తుంది. ఓటీపీని వెరిఫై చేయండి. ఆధార్ నెంబ‌ర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు క‌నిపిస్తాయి. బ్యాంక్ లింక్ స్టేట‌స్‌, లింక్ తేదీ కూడా ఉంటాయి. మీ ఆధార్ కు ఎన్ని బ్యాంకులు లింక్ అయ్యో అన్ని వివరాలు అక్కడే కనిపిస్తాయి. ఇలా మీ ఆధార్ నెంబర్ ను బ్యాంకు అకౌంటుతో లింక్ అయిందో తెలుసుకోవచ్చు. మీరు కూడా మీ ఆధార్ బ్యాంకు అకౌంటుతో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే వెంటనే లింక్ చేసుకోండి.. తద్వారా ప్రభెుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందవచ్చు.
E-Auction : నీరజ్‌ ఈటె రూ. కోటి 55 లక్షలు, సింధు రాకెట్ రూ. 90 లక్షలు

ట్రెండింగ్ వార్తలు