Okaya Electric Scooter : మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు

పెట్రోల్ ధరలు భారీగా పెరగడం, వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు.

Okaya Electric Scooter : మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు

Okaya Electric Scooter

Okaya Electric Scooter : పెట్రోల్ ధరలు భారీగా పెరగడం, వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా వాహనాలను డిజైన్ చేస్తూ దూసుకుపోతున్నాయి కంపెనీలు. పోటా పోటీగా ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి పలు కంపెనీలు. ఇక ఒకాయ ఎలక్ట్రిక్‌ వాహాలు తమ హై-స్పీడ్‌ ఈ-స్కూటర్‌ మార్కెట్లో విడుదల చేసింది. ఫాస్ట్‌ పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్‌ వాహనం ధర రూ.89,999 ఉన్నట్లు శుక్రవారం ఒకాయ పవర్‌ గ్రూప్‌ ఎండీ అనిల్‌ పేర్కొన్నారు.

చదవండి : Electricity Charges : తెలంగాణలో విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది-ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు

ఇక ఈ స్కూటర్ గరిష్ట వేగం 60 – 70 కిలోమీటర్లు ఉండగా.. ఒకసారి ఛార్జ్ చేస్తే కనిష్టం 150 నుంచి 200 కిలోమీటర్లు వరకు వెళ్తుంది. ఈ స్కూటర్‌ బ్యాటరీ 4.4 కిలోవాట్‌. లిథియం ఫాస్ఫేట్‌ బ్యాటరీ. ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. అయితే ఒకాయ ఎలక్ట్రిక్‌ వెబ్‌సైట్‌, డీలర్‌షిప్‌ల వద్ద రూ.1999 చెల్లించి స్కూటర్‌ను బుకింగ్‌ చేసుకోవాలని సంస్థ తెలిపింది.

చదవండి : Electric Vehicle : కేంద్రం బంపర్ ఆఫర్.. ఎలక్ట్రిక్ వాహనం కొంటే ‘లక్షన్నర’ వరకు ఆదా