Ola Electric Scooters : 10 కలర్ ఆప్షన్లలో ఓలా ఈ-స్కూటర్లు.. మీకు నచ్చిన కలర్ ఇదేనా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ పెరగడంతో కంపెనీ ఆకర్షణీయమైన ఈ-స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఓలా ఈ-స్కూటర్లలో 10 వేర్వేరు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది కంపెనీ.

Ola Electric Scooters : 10 కలర్ ఆప్షన్లలో ఓలా ఈ-స్కూటర్లు.. మీకు నచ్చిన కలర్ ఇదేనా?

Ola Electric Announces 10 Colour Options For E Scooters

Ola 10 colour options for e-Scooters : ఆటోమేకింగ్ కంపెనీ ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. లాంచింగ్ ముందుగానే ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ చేసుకున్నారు వినియోగదారులు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ పెరగడంతో కంపెనీ ఆకర్షణీయమైన ఈ-స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ఓలా ఈ-స్కూటర్లలో 10 వేర్వేరు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది కంపెనీ. ఓలా ఈ-స్కూటర్ల కలర్ ఆప్షన్లపై ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా రివీల్ చేశారు. రాబోయే ఓలా ఈ-స్కూటర్లు వైట్, బ్లాక్, రెడ్, ఎల్లో, స్కై బ్లూ, నేవీ బ్లూ, పింక్, గ్రే వేరియంట్లలో ఉండనున్నాయి. ఇప్పటికే బ్లాక్, వైట్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లపై అధికారికంగా ధ్రువీకరించిన కంపెనీ.. మిగతా కలర్లపై కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఓలా ఈ-స్కూటర్లను అన్ని వయస్సుల కస్టమర్లకు నచ్చేలా సరికొత్త డిజైన్ తో మార్కెట్లోకి తీసుకొస్తోంది.


ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ నెల (జూలై 15) నుంచి రిజర్వేషన్ ఫీజు రూ.499లతో కంపెనీ వెబ్ సైట్లో ప్రారంభించింది. రాబోయే ఈ-స్కూటర్ S సిరీస్‌లలో S1, S1 Pro, S సిరీస్ మూడు పేర్లతో రానున్నాయి. ఫీచర్ల విషయానికి వస్తే.. బూట్ స్పేస్ పెద్దదిగా ఉండనుంది. యాప్ ఆధారిత కీలెస్ యాక్సస్ అందిస్తోంది. డ్యుయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, సింగిల్ పీస్ సీట్, ఎక్స్ ట్రనల్ ఛార్జింగ్ పోర్ట్, LED DRL, టెైల్ లైట్, బ్లాక్ కలర్డ్ ఫ్లోర్ మ్యాట్, పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రూమింట్ క్లస్టర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయి.