Ola Electric: 24 గంటల్లో రూ.600కోట్ల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు

రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ.. వేగంగా అభివృద్ధి చెందుతూ.. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కష్టమర్లు.

Ola Electric: 24 గంటల్లో రూ.600కోట్ల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు

Ola

Ola Electric: రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ.. వేగంగా అభివృద్ధి చెందుతూ.. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కష్టమర్లు. ఈ క్రమంలోనే ఓలా సంస్థ తీసుకుని వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు విపరీతమైన డిమాండ్ లభిస్తోంది. వినియోగదారులకు ఈ స్కూటర్లను కొనుగోలు చేయడానికి సెప్టెంబర్ 16వ తేదీన చివరి రోజు అని ఈరోజు(16 సెప్టెంబర్ 2021) అర్ధరాత్రి వరకు కొనుగోలు చేయవచ్చని భవిష్య అగర్వాల్ వెల్లడించారు.

ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ సెప్టెంబర్ 15వ తేదీన తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం మొదలు పెట్టిన మొదటి 24 గంటల్లోనే రూ.600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించినట్లు చెప్పారు. “మేము ప్రతి సెకనుకు 4 స్కూటర్లను అమ్మాము. కేవలం 24గంటల్లో 45వేలకు పైగా S1, S1Pro బైక్‌లు అమ్ముడుపోయాయి. అది మొత్తం 2W పరిశ్రమ ఒక రోజులో విక్రయించే యూనిట్ల కంటే ఎక్కువ.” అని అగర్వాల్ తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేందుకు కొన్ని రాష్ట్రాలు రాయితీలను కూడా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది. మరియు ద్విచక్ర వాహన EVల కోసం భారీ దేశీయ మార్కెట్ ఉందని ఈ బుకింగ్‌ల ద్వారా నిరూపించబడింది. బలమైన స్థానిక EV పర్యావరణ వ్యవస్థను నడిపించడానికి, భారతదేశాన్ని ఒక పెద్ద EV మార్కెట్‌గా మార్చడానికి, గ్లోబల్ EV తయారీ కేంద్రం భారత్‌ను చేయడానికి కంపెనీ కృషి చేస్తుందని అగర్వాల్ చెప్పుకొచ్చారు.

Ola తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ S1 ని ప్రారంభ ధర S1 మోడల్ కోసం రూ .99,999కి అత్యంత శక్తివంతమైన మరియు లాంగ్-రేంజ్ S1 ప్రోని రూ .1,29,999కి మార్కెట్లోకి విడుదల చేసింది. గడిచిన రెండు నెలల్లో రూ.499కి తమ రిజర్వేషన్ స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి కూడా వినియోగదారులను అనుమతి ఇచ్చింది సంస్థ. సెప్టెంబర్ 8, 2021న కొనుగోళ్లను ప్రారంభించిన తర్వాత.. అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది. అయితే, తర్వాత కంపెనీ సెప్టెంబర్ 15న అమ్మకాలను ప్రారంభించింది. రూ .20,000 అడ్వాన్స్‌గా చెల్లించి అమ్మాకాలను నిర్వహించింది సంస్థ. అక్టోబర్ 2021 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు డెలివరీ కానున్నాయి.