Ola Electric Scooter: ఒక్క రోజులోనే లక్ష ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకం

మార్కెట్లోకి రాకముందే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ క్రేజ్ సంపాదించేసింది. ఎంతలా అంటే ఒక్కరోజులో లక్ష బుకింగ్స్ లు పూర్తి చేసుకుంది. టోకెన్ అమౌంట్.. రూ.499తో రిజిష్టర్ చేసుకుని ముందుగానే ఆర్డర్ పెట్టేస్తున్నారు.

Ola Electric Scooter: ఒక్క రోజులోనే లక్ష ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకం

Ola Electric Scooter

Ola Electric Scooter: మార్కెట్లోకి రాకముందే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ క్రేజ్ సంపాదించేసింది. ఎంతలా అంటే ఒక్కరోజులో లక్ష బుకింగ్స్ లు పూర్తి చేసుకుంది. టోకెన్ అమౌంట్.. రూ.499తో రిజిష్టర్ చేసుకుని ముందుగానే ఆర్డర్ పెట్టేస్తున్నారు. గడిచిన 24గంటల్లో లక్ష ఆర్డర్లను సొంతం చేసుకున్న మరో కంపెనీ ఇప్పటి వరకూ లేదని లేటెస్ట్ రికార్డులు చెబుతున్నాయి.

ఈ ఘనతపై స్పందించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఛైర్మన్, గ్రూప్ సీఈఓ భవిశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న తొలి ఎలక్ట్రిక్ వెహికల్ కు ఇంతటి రెస్పాన్స్ వస్తుండటంతో
థ్రిల్ గా ఫీల్ అవుతున్నా. ఎలక్ట్రిక్ వెహికల్ కు డిమాండ్ పెరిగిపోతుంది. ఎలక్ట్రికల్ వెహికల్ రివొల్యూషన్ లో జాయిన్ అయినందుకు వినియోగదారులకు థ్యాంక్స్ చెబుతున్నా. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని పేర్కొన్నారు.

రాబోయే స్కూటర్ బ్రాండ్ పేరు మాత్రం బయటపెట్టలేదు. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఆమోదం పొందిన అఫీషియల్ ట్రేడ్ మార్క్ ను మాత్రమే అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి అదే పేరుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అని పిలుస్తున్నారు. ఎస్ సిరీస్ తో లాంచ్ అవుతున్న స్కూటర్ ఎస్1, ఎస్1 ప్రో రెండు వేరియంట్లలో విడుదల అవుతుంది.

రెండు వేరియంట్లతో పాటు బ్లూ, బ్లాక్, పింక్ రంగుల్లో విడుదల చేస్తున్ానరు. అల్లోయ్ వీల్స్, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, క్లౌడ్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉండగా.. దీని ఖరీదు లక్ష వరకూ ఉండొచ్చు.