Ola electric Sales: ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల సేల్ మొదలైందోచ్.. బుకింగ్ గైడ్ ఇదిగో!

ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ ప్రారంభమయ్యాయి.  స్కూటర్ బుకింగ్ గైడ్ కూడా అందిస్తోంది. రిజర్వ్ చేసుకున్న కస్టమర్లు స్కూటర్లను మిగిలిన మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకోవచ్చు

Ola electric Sales: ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల సేల్ మొదలైందోచ్.. బుకింగ్ గైడ్ ఇదిగో!

Ola Electric Scooter Sale Starts

Ola electric scooter sale start : ప్రముఖ ఓలా కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ ప్రారంభమయ్యాయి.  ఓలా స్కూటర్ బుకింగ్ చేసుకోవాలంటే గైడ్ కూడా అందిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ రిజర్వ్ చేసుకున్న వినియోగదారులు మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆన్ లైన్ సేల్స్ కు సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారం పాటు వాయిదా పడింది. ఓలా స్కూటర్ బుకింగ్ చేసుకున్న కస్టమర్లు మిగిలిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చ. అలాగే మీకు నచ్చిన వేరియంట్, కలర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా స్కూటర్ సేల్స్ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఓలా S1 సేల్ అందుబాటులోకి వచ్చిందన్నారు. రిజర్వేషన్ ప్రకారం బుకింగ్ తెరుస్తున్నామని చెప్పారు. బుకింగ్ చేసుకున్న వారి ఈ-మెయిల్ కు మెసేజ్ వస్తుందని తెలిపారు. ఓలా యాప్‌లో కూడా బుకింగ్ వివరాలను తెలుసుకునే సమాచారం ఉంది. గత నెలలో ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 2 వేరియంట్లలో S1, S1 ప్రో వరుసగా రూ. 99,999, రూ. 1,29,999 రిలీజ్ చేసింది. రాష్ట్రాల్లో అమలయ్యే సబ్సిడీల ఆధారంగా ధరలు మారనున్నాయి.
iPhone 13 : ఆపిల్ ఈవెంట్‌లో ‘ద‌మ్ మారో ద‌మ్ సాంగ్‌’ వీడియో!

బుకింగ్ చేసుకోండిలా :
ముందస్తు బుకింగ్ ధర చెల్లించారా? మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ వెబ్ సైట్లో లాగిన్ కావొచ్చు.  మీకు నచ్చిన స్కూటర్ వేరియంట్ ఎంచుకోవచ్చు. స్కూటర్ బుక్ చేయలేదంటే..  రూ. 499 టోకెన్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే  బుక్ చేసుకోవచ్చు. కొనుగోలు చేసే వేరియంట్ ఎంచుకున్న తర్వాత 10 కలర్లలో ఏదైనా ఒక కలర్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. స్కూటర్ ఫైనాన్స్ తీసుకుంటే S1 స్కూటర్ కోసం నెలవారీ వాయిదా రూ. 2,999  నుంచి అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అధునాతన వెర్షన్ అయిన ఓలా S1 ప్రో నెల EMIలు రూ. 13,199 నుంచి ప్రారంభం కానున్నాయి.

స్కూటర్ ఫైనాన్సింగ్ కావాలంటే.. ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్.. IDFC ఫస్ట్ బ్యాంక్, HDFC, టాటా క్యాపిటల్ సహా ప్రముఖ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. HDFC బ్యాంక్ ఓలా, ఓలా ఎలక్ట్రిక్ యాప్స్ ద్వారా అర్హత కలిగిన కస్టమర్లకు నిమిషాల్లో pre-approved లోన్లను పొందవచ్చు. టాటా క్యాపిటల్, IDFC ఫస్ట్ బ్యాంక్ డిజిట్ KYCని ప్రాసెస్ చేస్తోంది. అర్హత కలిగిన కస్టమర్లకు ఇన్‌స్టంట్ రుణాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. మీకు ఫైనాన్సింగ్ అవసరం లేకుంటే.. ఓలా S1 కోసం రూ. రూ. 20వేలు, ఓలా S1 pro కోసం రూ. రూ. 25,000 అడ్వాన్స్ చెల్లించవచ్చు. మిగిలిన మొత్తం నగదును ఇన్వాయిస్ ద్వారా చెల్లించవచ్చు.

కొనుగోలు పూర్తయిన తర్వాత డెలివరీ ఎప్పుడు అవుతుందో తేదీ కూడా ప్రకటిస్తారు.  అక్టోబర్ నెలలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీ ఇంటికే స్కూటర్ డెలివరీ అవుతుంది.
PM Modi : ఐరన్ స్ర్కాప్‌తో 14 అడుగుల ఎత్తైన మోదీ విగ్రహం..!