E-Scooter : ఓలా ఈ స్కూటర్ వచ్చేస్తోంది

ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్ స్కూటర్ ను ఈ సంవత్సరం జూలైలో దేశీ మార్కెట్ లో ప్రవేశపెట్టనున్నట్లు ఓలా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది.

E-Scooter : ఓలా ఈ స్కూటర్ వచ్చేస్తోంది

Ola

Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ తమ విద్యుత్ స్కూటర్ ను ఈ సంవత్సరం జూలైలో దేశీ మార్కెట్ లో ప్రవేశపెట్టనున్నట్లు ఓలా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 400 నగరాల్లో ఒక లక్ష ఛార్జింగ్ పాయింట్లతో హైపవర్ చార్జర్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు జరుపుతున్నట్లు ఓలా ఛైర్మన్ భవీష్ అగర్వాల్ వెల్లడించారు. జూన్ నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 20 లక్షల యూనిట్లుగా ఉండే దీని సామర్థ్యం..తర్వాత..ఏడాది కాలంలో దీనిని పెంచుతామన్నారు.

జులై నుంచి అమ్మకాలు స్టార్ట్ చేస్తామని తెలిపారు. కానీ అసలు దీని ధర ఎంత అనేది ఆయన వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి ఛార్జింగ్ నెటవర్క్ పటిష్టంగా ఉండాలని, ఈ విషయంలో తాము స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నామని అగర్వాల్ తెలిపారు. ఇందుకు హైపర్ ఛార్జర్ నెట్ వర్క్ ద్విచక్ర వాహనాలను అత్యంత వేగంగా ఛార్జింగ్ చేసే విధంగా ఉంటుందన్నారు. ఓలా స్కూటర్‌ బ్యాటరీ సామర్థ్యంలో 50 శాతాన్ని కేవలం 18 నిమిషాల్లో చార్జింగ్‌ చేయగలిగేదిగా ఉంటుందని, 75 కి.మీ. దూరం ప్రయాణానికి సరిపోగలదని అగర్వాల్‌ వివరించారు.

తొలి సంవత్సరానికి 100 నగరాల్లో 5 వేల పైచిలకు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని, మాల్స్, ఐటీ పార్కులు, ఆఫీసు కాంప్లెక్స్ లు , కేఫెలు ఇతరత్రా చోట్ల ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లకు దగ్గరలో ఉండేలా ఛార్జింగ్ పాయింట్లను స్టాండ్ ఎలోన్ టవర్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఓలా ఎలక్ట్రిక్‌ యాప్‌ ద్వారా చార్జింగ్‌ పరిస్థితిని కస్టమర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, చెల్లింపులు కూడా యాప్‌ ద్వారానే చేయొచ్చని అగర్వాల్‌ వెల్లడించారు.

Read More : Nithyananda : కైలాశ ద్వీపానికి రావొద్దు..నిత్యానంద సూచన