Amazon Discount: డిస్కౌంట్ తర్వాత ప్లాస్టిక్ బకెట్ రూ.26వేలు, బాత్రూం మగ్ రూ.10వేలు

అమెజాన్ లో 55శాతం డిస్కౌంట్ వర్తిస్తేనే బకెట్ ధర రూ.25వేల 999గానూ, రెండు ప్లాస్టిక్ మగ్ ల ధర రూ.10వేలు గానూ చూపించింది. ఇదేదో టెక్నికల్ ఎర్రర్ అనుకున్నా.. ఇలాంటి తప్పు ఎందుకు అమెజాన్ లో ఎందుకు వచ్చిందనే దానిపై వివరణ అడుగుతూ కొందు అమెజాన్ ను సంప్రదించారు.

Amazon Discount: డిస్కౌంట్ తర్వాత ప్లాస్టిక్ బకెట్ రూ.26వేలు, బాత్రూం మగ్ రూ.10వేలు

Amazon (1)

Amazon Discount: అమెజాన్ లో 55శాతం డిస్కౌంట్ వర్తిస్తేనే బకెట్ ధర రూ.25వేల 999గానూ, రెండు ప్లాస్టిక్ మగ్ ల ధర రూ.10వేలు గానూ చూపించింది. ఇదేదో టెక్నికల్ ఎర్రర్ అనుకున్నా.. ఇలాంటి తప్పు ఎందుకు అమెజాన్ లో ఎందుకు వచ్చిందనే దానిపై వివరణ అడుగుతూ కొందు అమెజాన్ ను సంప్రదించారు.

ట్విట్టర్ వినియోగదారులు ఈ ఖరీదైన ప్లాస్టిక్ మగ్‌లు, బకెట్ స్క్రీన్‌షాట్‌లను ట్రోల్ చేస్తున్నారు. అమెజాన్‌పై కామెంట్లు చేస్తున్నారు. ఇది పూర్తిగా కంపెనీ తప్పిదం కాదు, ఎందుకంటే ఉత్పత్తులను, ధరతో సహా దాని వివరాలను జాబితా చేసేది సంబంధిత సేల్స్ ప్రొవైడర్. ఈ “సూపర్ ఖరీదైన” బకెట్లు, బాత్రూమ్ మగ్‌ల విషయంలో కూడా వాళ్లదే బాధ్యత.

తప్పు ప్రధానంగా విక్రయించేవారిది అయినప్పటికీ, ట్విట్టర్ అమెజాన్‌పైనే దాడి చేస్తున్నాయి.

Read Also: అమెజాన్‌లో ఐఫోన్ 12పై రూ.12వేలు డిస్కౌంట్

వెబ్‌సైట్‌లో ప్లాస్టిక్ మగ్ అసలు ధర రూ.22వేల 80గా చూపించారు. 55 శాతం తగ్గింపు ధర రూ.9వేల 914కి పడిపోయింది. ఇలాంటివి జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ కొన్ని వస్తువులను అధిక ధరకు జాబితా చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి.