OnePlus 10 Pro : లాంచింగ్ ముందే ఫీచర్లు లీక్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తోంది..!

వన్‌ప్లస్ (OnePlus) అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా అధికారిక లాంచింగ్ ముందే లీక్ అయ్యాయి. 2022 జనవరిలో వన్‌ప్లస్ నుంచి Oneplus 10 Pro రిలీజ్ కావాల్సి ఉంది.

OnePlus 10 Pro : లాంచింగ్ ముందే ఫీచర్లు లీక్.. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తోంది..!

Oneplus 10 Pro Specifications

OnePlus 10 Pro Specifications : గ్లోబల్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు పోటాపోటీగా ఫ్లాగ్ షిప్ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రాగా.. మరికొన్ని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా స్మార్ట్ ఫోన్ రిలీజ్ కావడానికి ముందే ఫీచర్లు, స్పెషిఫికేషన్లు రిలీజ్ కావడం కామన్.. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా అధికారిక లాంచింగ్ ముందే లీక్ అయ్యాయి. వచ్చే ఏడాది 2022 జనవరిలో వన్ ప్లస్ నుంచి Oneplus 10 Pro రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే అంతలోనే ఈ ఫోన్ మోడల్ స్పెషిఫికేషన్లు రివీల్ అయ్యాయి. బెంచ్ మార్కింగ్ ప్లాట్ ఫాం Geekbench, చెైనా కంప్లసరీ సర్టిఫికేషన్ (3C) వెబ్‌సైట్లో ఈ ఫోన్ ఫీచర్లు కనిపించాయి. Geekbench వెబ్ సైట్ ప్రకారం.. రాబోయే Oneplus 10 Pro వేరియంట్.. 12GB RAM కెపాసిటీతో రానుంది. అంతేకాదు.. 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో వస్తోంది.

ఇప్పటికే ఈ ఫోన్ మోడల్ లో Qualcomm లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 SoC కలిగి ఉన్నట్టు ధ్రువీకరించింది కంపెనీ. ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ (Oneplus 10 Pro) నెక్స్ట్ జనరేషన్‌లో టెంపరేచర్ పాలీక్రైస్టాలైన్ ఆక్సైడ్ (LTPO)డిస్‌ప్లేతో పాటు NE2210 మోడల్‌తో రానుంది.

చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ (MIIT) వెబ్ సైట్లలో ఇదే మోడల్ కనిపించింది. OnePlus 10 రెగ్యులర్ మోడల్‌కు ఇది అడ్వాన్స్ వెర్షన్‌గా చెప్పవచ్చు. ఈ ఫోన్‌లోని చిప్‌సెట్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 SoCతో కలిసిన ‘taro’ కొడ్‌నేమ్‌ (codename)తో రానుంది. మెమరీ విషయానికి వస్తే.. 10.97GBతో రానుంది.. ఇది.. 12GB RAM వరకు ట్రాన్ లేట్ చేయగలదు.

వన్ ప్లస్ ఫోన్ Android 12 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో రానుంది. ఈ హ్యాండ్ సెట సింగిల్ కోర్ స్కోర్ 976 పాయింట్స్ కలిగి ఉండగా.. మల్టీ కోర్ స్కోరు 3,469 పాయింట్స్ అందుకుంది. ఇదిలా ఉండగా.. వన్‌ప్లస్ ఫోన్ నుంచి ఒకే మోడల్ నంబర్ NE2210 కూడా 3C వెబ్ సైట్లో కనిపించింది. ఈ ఫోన్ మోడల్ ఛార్జర్ గరిష్టంగా (7.3 అంపెరర్ 11V)తో రానుంది. అంటే.. 80W ఫాస్ ఛార్జింగ్ సపోర్టు అందించనుంది.

Read Also : Android Update: త్వరలో ఈ ఫోన్ లకు ఆండ్రాయిడ్ 12 OS అప్డేట్