OnePlus 10T 5G : అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త 10T 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఆగస్టు 3న భారత మార్కెట్లోకి OnePlus 10T 5G లాంచ్‌ చేయనుంది.

OnePlus 10T 5G : అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Oneplus 10t 5g Is Coming Next Month, Launch Date In India Officially Confirmed

OnePlus 10T 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త 10T 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఆగస్టు 3న భారత మార్కెట్లోకి OnePlus 10T 5G లాంచ్‌ చేయనుంది. ఈ మేరకు కంపెనీ సోషల్ మీడియా అకౌంట్లలో ధ్రువీకరించింది. అయితే ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ న్యూయార్క్‌లో జరుగనుంది. ఈ 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో కూడా లాంచ్ కానుంది. ఆగస్టు 3న రాత్రి 7:30 గంటలకు ఈవెంట్ లాంచ్ లైవ్ ప్రారంభమవుతుంది. OnePlus Nord 2T 5G లాంచ్ అయిన కొద్ది వారాల తర్వాత OnePlus 10T 5G భారత మార్కెట్లోకి రానుంది.

ఇందులో ‘T’ మోనికర్‌తో వచ్చిన చివరి వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇదే.. వన్‌ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 2020లో లాంచ్ అయింది. T-సిరీస్ సాధారణంగా ఆ ఏడాదిలో అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. రాబోయే OnePlus 10T మరిన్ని అప్‌గ్రేడ్‌లతో వస్తుందని అంచనా. వన్ ప్లస్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. OnePlus 10T హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరాలు, 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. OnePlus 10 Pro 5G 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. టోన్డ్-డౌన్ సిబ్లింగ్, OnePlus 10R 5G, 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

Oneplus 10t 5g Is Coming Next Month, Launch Date In India Officially Confirmed (1)

Oneplus 10t 5g Is Coming Next Month, Launch Date In India Officially Confirmed 

OnePlus 10T స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్ డేటా బయటకు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే, సింగిల్ సెల్ఫీ కెమెరాతో కేంద్రీయంగా హోల్-పంచ్‌తో రానుంది. టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ అందించిన రెండర్ కటౌట్‌ను టాప్-లెఫ్ట్ కాకుండా టాప్ సెంటర్ లో రానుంది.

OnePlus స్మార్ట్‌ఫోన్‌లలో ఇదే మాదిరిగా అందించింది. అయితే వన్‌ప్లస్ 10Rలో కూడా అలర్ట్-స్లైడర్ ఉండదని సూచించింది. 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మొదటి OnePlus స్మార్ట్‌ఫోన్ OnePlus 10T అని మరో లీక్ పేర్కొంది. Asus వంటి బ్రాండ్‌లు లేటెస్ట్ ROG గేమింగ్ ఫోన్‌లతో అధిక RAM కాన్ఫిగరేషన్‌ను అందించాయి. OnePlus 10T ఇతర ముఖ్య ఫీచర్లలో 4,800mAh, OISతో 50-MP Sony IMX766 ప్రైమరీ కెమెరా, 32-MP ఫ్రంట్ కెమెరా కూడా అందిస్తోంది.

Read Also : Apple Watch : ఈ ఆపిల్ వాచ్.. మీ హార్ట్‌బీట్‌లో తేడా ఉన్నా చెప్పేస్తుంది.. డెడ్లీ ట్యూమర్లను పసిగట్టేస్తుంది!