OnePlus 10T : జూలైలో వన్‌ప్లస్ 10T వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చుంటే?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి ప్రీమియం OnePlus 10T స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ కొత్త వన్‌ప్లస్ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లోకి వస్తుందని హింట్ ఇచ్చారు.

OnePlus 10T : జూలైలో వన్‌ప్లస్ 10T వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చుంటే?

Oneplus 10t Launching In India In July Here’s What You Need To Know

OnePlus 10T : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి ప్రీమియం OnePlus 10T స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ కొత్త వన్‌ప్లస్ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లోకి వస్తుందని హింట్ ఇచ్చారు. జూలై చివరి నాటికి వన్‌ప్లస్ 10T మార్కెట్లో లాంచ్ అవుతుందని తెలిపాడు. రాబోయే ఫోన్ OnePlus 10T ఫీచర్లు, ధర ఎంత అనేది ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. అయితే కంపెనీ వచ్చే నెలలోగా డివైజ్‌ని లాంచ్ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. రాబోయే రెండు వారాల్లో OnePlus 10T స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. కొంచెం తక్కువ ధర విభాగంలో హైఎండ్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల సైజులో 120Hz డిస్‌ప్లేతో వస్తుందని తెలిపింది. HDR 10+ సర్టిఫికేట్‌ను కలిగి ఉంటుంది. RBG, డిస్‌ప్లే P3 కలర్ గామట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కోటింగ్‌కు సపోర్టునిస్తుంది. AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. Qualcomm Snapdragon 8 Gen 1 SoC ద్వారా రన్ అవుతుంది.128GB RAM, 256GB స్టోరేజ్ సపోర్టు చేస్తుంది. 150W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టుతో 4,800mAh బ్యాటరీని కలిగి ఉంది.

Oneplus 10t Launching In India In July Here’s What You Need To Know (1)

Oneplus 10t Launching In India In July Here’s What You Need To Know 

ఫ్రంట్ సైడ్.. సెల్ఫీలకు ఒకే 16-MP కెమెరాను చూడవచ్చు. వెనుకవైపు.. 50-MP Sony IMX766 ప్రైమరీ సెన్సార్, 8-MP అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2-MP మాక్రో సెన్సార్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. వైర్‌లెస్ ఛారింగ్ సపోర్టు కూడా ఉంది. కంపెనీ OnePlus 10T, రూ. 50,000లో లాంచ్ చేయాలని భావిస్తోంది. అధికారిక IPతో రానుంది. X-యాక్సిస్ లీనియర్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. OnePlus ప్లాన్ 5G ఫోన్‌ యూజర్లు ఎలా ఒప్పించగలదో కాలమే చెబుతుంది.

ధర ఎంతంటే? :
OnePlus 10T వన్‌ప్లస్ 9RT స్మార్ట్‌ఫోన్ కన్నా ఎక్కువ ఖర్చవుతుందని అంచనా. పవర్ ఫుల్ చిప్‌సెట్‌ను కలిగి ఉన్నట్లు తెలిపింది. 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని తెలిపింది. OnePlus 10 Pro ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 64,998 తగ్గింపు ధరతో రానుంది. Onelus 10T స్మార్ట్‌ఫోన్ అందించే ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని రూ. 50,000 రేంజ్ ఉండనుంది. OnePlus 9RT భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 41,999కి అందుబాటులోకి రానుంది. ఇదంతా కేవలం అంచనా మాత్రమే.. OnePlus ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అధికారిక ధర ఎంత ఉండొచ్చో ఇప్పుడే చెప్పలేం..

Read Also : OnePlus 10 5G : వన్‌ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు లీక్..!