OnePlus 11 5G First Phone : వన్‌ప్లస్ సరికొత్త సాఫ్ట్‌వేర్ పాలసీ.. నాలుగేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్ సపోర్టుతో వన్‌ప్లస్ 11 5G ఫస్ట్ ఫోన్ ఇదే..!

OnePlus 11 5G First Phone : వన్‌ప్లస్ సరికొత్త సాఫ్ట్‌వేర్ పాలసీ.. నాలుగేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్ సపోర్టుతో వన్‌ప్లస్ 11 5G ఫస్ట్ ఫోన్ ఇదే..!

OnePlus 11 5G First Phone _ OnePlus 11 5G to be first phone from company with long term Android update support (1)

OnePlus 11 5G First Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి OnePlus 11 5G కొత్త ఫోన్ ఫిబ్రవరి 7న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే, ఈ కొత్త ఫోన్ మోడల్ దీర్ఘకాలిక ఆండ్రాయిడ్ అప్‌డేట్ సపోర్ట్‌ను పొందే ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ధృవీకరించింది. 5G ఫోన్ కంపెనీ నుంచి 4 ఏళ్ల Android OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందడానికి అర్హత కలిగి ఉంది. ఎందుకంటే ఈ ఫ్లాగ్‌షిప్ OnePlus 11 ఫోన్ ప్రీమియం ధరతో అన్ని ఆఫర్లతో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్ కంపెనీ కొత్త ఫోన్‌లలో ఇటీవల ప్రకటించిన కొత్త సాఫ్ట్‌వేర్ పాలసీ అని చెప్పవచ్చు. ఈ అప్‌డేట్ 2023లో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని OnePlus గతంలో పేర్కొంది. కొత్త పాలసీకి అర్హత పొందే ఫోన్‌ల పేరును బ్రాండ్ రివీల్ చేయలేదు. OnePlus ఈవెంట్ కొంచెం ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఎందుకంటే శాంసంగ్ ఇప్పటికే అదే పాలసీని అందిస్తోంది.

ఈ డివైజ్ కొనుగోలు చేసే వారికి 3 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం పాటు పొందే అవకాశం ఉంది. OnePlus కూడా OnePlus 11 యూజర్లకు నాలుగు తరాల OxygenOS అప్‌డేట్‌లను అందిస్తామని తెలిపింది. ఇప్పటివరకు, కంపెనీ పోస్ట్ చేసిన టీజర్లు కొత్త 5G ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుందని ధృవీకరించాయి. క్వాల్‌కామ్ కొత్త చిప్ సపోర్ట్ చేసే శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తుందో లేదో వెల్లడించలేదు.

OnePlus 11 5G First Phone _ OnePlus 11 5G to be first phone from company with long term Android update support (1)

OnePlus 11 5G First Phone _ OnePlus 11 5G to be first phone

Read Also : Samsung Galaxy S22 Price Cut : శాంసంగ్ గెలాక్సీ S22 ధర తగ్గిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు!

శాంసంగ్ Ultra మోడల్‌ను రూ. 1 లక్ష కన్నా ఎక్కువ ధరకు విక్రయించింది. రాబోయే వన్‌ప్లస్ 11 చాలా సరసమైనది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ భారత మార్కెట్లో కొత్త OnePlus ఫోన్ ధరలను పొందినట్లు పేర్కొన్నారు. OnePlus 11 5G రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి రానుందని ట్విట్టర్‌లో రివీల్ చేశారు. OnePlus 11 5G మోడల్ 16GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 61,999గా ఉంది.

8GB RAM మోడల్ ధర ప్రస్తుతానికి తెలియదు. OnePlus 11 ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బేస్ మోడల్ ధర చెప్పలేం. చైనాలో ఈ హ్యాండ్‌సెట్ యువాన్ 3,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో దాదాపు రూ. 48,900గా ఉంది. భారత్‌లో వన్‌ప్లస్ 11 ప్రారంభ ధర, బేస్ మోడల్ ధర రూ. 60వేల లోపు ఉండవచ్చని అంచనా.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus 11 5G Pre-Order : ఫిబ్రవరి 7 నుంచి భారత్‌లో వన్‌ప్లస్ 11 5G ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?