OnePlus 11 Price Leak : అత్యంత చౌకైన ధరకే వన్‌ప్లస్ 11 ఫోన్ వచ్చేస్తోంది.. iQOO 11 కన్నా చీపెస్ట్ 5G ఫోన్ ఇదే..? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus 11 Price Leak : భారతీయ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లో అత్యంత చౌకైన ధరకే OnePlus 11 5G ఫోన్ వచ్చేస్తోంది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (OnePlus 11) ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో జరిగే క్లౌడ్ 11 ఈవెంట్‌లో లాంచ్ కానుంది.

OnePlus 11 Price Leak : అత్యంత చౌకైన ధరకే వన్‌ప్లస్ 11 ఫోన్ వచ్చేస్తోంది.. iQOO 11 కన్నా చీపెస్ట్ 5G ఫోన్ ఇదే..? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

The OnePlus 11 may undercut the iQOO 11 to be the cheapest Snapdragon 8 Gen 2 smartphone in India

OnePlus 11 Price Leak : భారతీయ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లో అత్యంత చౌకైన ధరకే OnePlus 11 5G ఫోన్ వచ్చేస్తోంది. లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ (OnePlus 11) ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో జరిగే క్లౌడ్ 11 ఈవెంట్‌లో లాంచ్ కానుంది. ఈ డివైజ్ ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులోకి రాగా.. భారత మార్కెట్లో దీని ధర ఎంత ఉంటుంది అనేది కంపెనీ రివీల్ చేయలేదు. కానీ, ప్రైస్‌బాబా నివేదిక ప్రకారం.. OnePlus 11 కీబోర్డు,Buds Pro 2 కీబోర్డ్ ధరలు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి.

OnePlus 11 ఫోన్ ధర (అంచనా) :
వన్‌ప్లస్ 11 ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 54,999గా ఉండనుంది. 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 59,999, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 66,999గా ఉంటుందని నివేదిక వెల్లడించింది.

The OnePlus 11 may undercut the iQOO 11 to be the cheapest Snapdragon 8 Gen 2 smartphone in India

The OnePlus 11 may undercut the iQOO 11 to be the cheapest smartphone in India

iQOO 11 ఫోన్‌తో పోలిస్తే.. OnePlus 11 మోడల్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 59,999గా ఉంది. OnePlus 11 కన్నా తక్కువ RAMని అందిస్తుండగా.. దీని ధర రూ. 5 వేలుగా ఉండనుంది. కేవలం iQOO 11 ఫోన్ మాత్రమే కాదు.. OnePlus 11 భారత మార్కెట్లో రూ. 66,999 ధర కలిగిన OnePlus 10 ప్రో కన్నా చాలా చౌకగా ఉండవచ్చు.

Read Also :  iQOO 11 First Sale in India : iQOO 11 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

OnePlus బడ్స్ ప్రో 2, OnePlus కీబోర్డ్ ధర (అంచనా) :
OnePlus 11తో పాటు, బడ్స్ ప్రో 2, OnePlus కీబోర్డ్ ధరలను కంపెనీ వెల్లడించింది. OnePlus బడ్స్ ప్రో 2 ధర రూ. 11,999గా ఉండగా.. OnePlus Buds Pro కన్నా దాదాపు రూ. 2 వేలు ఎక్కువగా ఉంటుంది. OnePlus కీబోర్డ్ ధర రూ. 9,999గా ఉంటుందని చెప్పవచ్చు.

The OnePlus 11 may undercut the iQOO 11 to be the cheapest Snapdragon 8 Gen 2 smartphone in India

The OnePlus 11 may undercut the iQOO 11 to be the cheapest smartphone in India

OnePlus 11 స్పెసిఫికేషన్లు (అంచనా) :
OnePlus 11 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13లో ఆక్సిజన్‌OS 13తో రన్ అవుతుంది. 6.7-అంగుళాల క్వాడ్ HD+ (3216 x 1440 పిక్సెల్‌లు) 2.75D కర్వ్డ్ AMOLED LTPO 3.0 డిస్‌ప్లేతో పాటు డాల్బీ విజన్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2తో 16GB వరకు LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్‌తో వచ్చింది.

గత వెర్షన్ల మాదిరిగా కాకుండా OnePlus 11 5G ఫోన్12GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. OnePlus బేస్ వేరియంట్ ఇంటర్నల్ స్టోరేజీని 128GB నుంచి 256 GBకి పెంచుకోవచ్చు. OnePlus వన్‌ప్లస్ 11 అధిక ఫ్రేమ్ రేట్ కోసం కస్టమ్ గ్రాఫిక్స్ ఇంజిన్‌ను అందించనుంది. ప్రపంచంలో ఇదే ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ ఫోన్ అన్ని గేమ్‌లలో సెకనుకు 120 ఫ్రేమ్‌లను (FPS) అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

The OnePlus 11 may undercut the iQOO 11 to be the cheapest Snapdragon 8 Gen 2 smartphone in India

The OnePlus 11 may undercut the iQOO 11 to be the cheapest smartphone in India

ఈ డివైజ్ బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో సోనీ IMX890 సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా, సోనీ IMX581 సెన్సార్‌తో 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, సోనీ IMX709 సెన్సార్‌తో 32MP RGBW టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో, డివైజ్16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

OnePlus 11 5G 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వచ్చింది. ఈ డివైజ్ 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 10 నిమిషాల ఛార్జ్ 50 శాతం బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ డివైజ్ భారత మార్కెట్లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను మాత్రమే అందిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iOS 16.3 Update : ఆపిల్ ఐఫోన్లలో కొత్త iOS 16.3 సెక్యూరిటీ అప్‌డేట్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుంది? ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?