OnePlus 5G Upgrade Days Sale : వన్‌ప్లస్ 5G అప్‌గ్రేడ్ డేస్ సేల్.. వన్‌ప్లస్ 11, 11R ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

OnePlus 5G Upgrade Days Sale : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? లేటెస్ట్ సేల్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ ఫోన్లలో వన్‌ప్లస్ వంటి ప్రీమియం OnePlus స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

OnePlus 5G Upgrade Days Sale : వన్‌ప్లస్ 5G అప్‌గ్రేడ్ డేస్ సేల్.. వన్‌ప్లస్ 11, 11R ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

OnePlus announces 5G Upgrade Days sale, new OnePlus 11 and 11R get big discounts for limited period

OnePlus 5G Upgrade Days Sale : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) తమ ఫోన్లపై (5G Upgrade Days Sale) ఈవెంట్ నిర్వహిస్తోంది. లేటెస్ట్ సేల్ ఈవెంట్‌లో
వన్‌ప్లస్ ఫోన్లలో వన్‌ప్లస్ (OnePlus 11, OnePlus 11R, OnePlus 10 Pro, OnePlus 10T వంటి ప్రీమియం OnePlus స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. OnePlus 5G అప్‌గ్రేడ్ డేస్‌ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

భారతీయ కస్టమర్‌లు 5Gకి సపోర్టు ఇచ్చే కొత్త OnePlus స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ చేసుకోవాలని కంపెనీ కోరుతోంది. ఈ వన్‌ప్లస్ డివైజ్‌లతో బ్రౌజింగ్, కంటెంట్‌ యాక్సస్ చేయడం లేదా అద్భుతమైన కెమెరా సిస్టమ్‌తో కంటెంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. OnePlus ఫోన్‌లు (Airtel), Jio 5G సర్వీసులను సపోర్ట్ చేస్తాయి. రెండు టెల్కోలు భారత్‌లోని వినియోగదారుల కోసం ఉచితంగా 5G టెస్టింగ్ చేసేందుకు అనుమతిస్తున్నాయి.

వన్‌ప్లస్ 5G అప్‌గ్రేడ్ డేస్ సేల్ మార్చి 31 వరకు కొనసాగుతుందని కంపెనీ పేర్కొంది. ఈ సేల్ ఈవెంట్ భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు OnePlus ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల పోర్ట్‌ఫోలియోపై వరుస ఆఫర్‌లను పొందవచ్చు. అధికారిక OnePlus వెబ్‌సైట్, OnePlus స్టోర్ యాప్‌లో తాత్కాలిక డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, దీర్ఘకాలిక బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు.

వన్‌ప్లస్ 11 5G ఫోన్ ధర ఎంతంటే? :
వన్‌ప్లస్ 11 5G ఫోన్ ధర రూ. 56,999 నుంచి అందుబాటులో ఉంది. కొత్త (OnePlus 11 5G) ఎలాంటి డిస్కౌంటు అందుబాటులో లేదు, అయితే OnePlus 5G అప్‌గ్రేడ్ డేస్ సేల్ సమయంలో వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్‌లు రూ. 2వేల వరకు తగ్గింపును పొందవచ్చు. 12 నెలల వరకు నో-కాస్ట్ EMI పేమెంట్ మెథడ్ ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంది. వినియోగదారులు (Jio SIM)తో రూ. 11,200 విలువైన బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఫోన్‌తో 6 నెలల గూగుల్ వన్, యూట్యూబ్ ప్రీమియం ఉచితంగా పొందవచ్చునని వన్‌ప్లస్ పేర్కొంది. మీరు 6 నెలల Spotify ప్రీమియం సభ్యత్వాన్ని కూడా ఆస్వాదించవచ్చు. OnePlus ఇతర 4G ఆండ్రాయిడ్ డివైజ్‌ల వినియోగదారులకు OnePlus 11 5G కొనుగోలుపై రూ. 3వేల ఎక్స్చేంజ్ తగ్గింపును అందిస్తోంది. OnePlus 11R 5G ధర రూ. 39,999 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : OnePlus 11R Discount Price : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైన ఈ 5G ఫోన్ కొనొచ్చు? ధర ఎంత తగ్గిందో తెలుసా?

అదేవిధంగా, కొత్త OnePlus 11R 5G ఫోన్ కూడా తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 11R 5G కొనుగోలుపై 4G OnePlus, iOS డివైజ్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు రూ. 3వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. OneCard క్రెడిట్ కార్డ్ ద్వారా EMI వినియోగదారులు OnePlus 5G అప్‌గ్రేడ్ డేస్ సేల్ సమయంలో రూ. 1,750 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.. బజాజ్ ఫైనాన్స్ కస్టమర్‌లు OnePlus 11R 5Gని తొమ్మిది నెలల వరకు ప్రత్యేకంగా OnePlus ఇండియా వెబ్‌సైట్‌లో నో-కాస్ట్ EMIతో కొనుగోలు చేయవచ్చు.

OnePlus announces 5G Upgrade Days sale, new OnePlus 11 and 11R get big discounts for limited period

OnePlus announces 5G Upgrade Days sale, new OnePlus 11 and 11R get big discounts for limited period

OnePlus 10 Pro 5G ఫోన్ ధర ఎంతంటే? :

OnePlus 10 Pro 5G ఫోన్ ధర రూ. 55,999 నుంచి అందుబాటులో ఉంది. వన్‌ప్లస్10 Pro 5G ఇప్పటికీ OnePlus అత్యంత ప్రీమియం ఫోన్, OnePlus 5G అప్‌గ్రేడ్ డేస్ సేల్ సమయంలో తాత్కాలిక ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇతర ఆఫర్‌లలో 4G, OnePlus iOS డివైజ్‌లపై రూ. 10వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్, ఇన్‌స్టంట్ బ్యాంక్ OneCard క్రెడిట్ కార్డ్‌లతో (EMI Payment) రూ. 2వేలు తగ్గింపు, బజాజ్ ఫైనాన్స్ కార్డ్‌లపై 6 నెలల నో-కాస్ట్ EMI పొందవచ్చు. OnePlus 10T 5G ధర రూ. 44,999లకు పొందవచ్చు. OnePlus 5G అప్‌గ్రేడ్ డేస్ సేల్ సందర్భంగా అన్ని వేరియంట్‌లపై తాత్కాలిక ధరను అందిస్తున్నాయి.

8GB RAM, 128GB స్టోరేజ్ బేస్ మోడల్ రూ.44,999కి విక్రయిస్తోంది. వన్‌ప్లస్ 4G, OnePlus, iOS డివైజ్ వినియోగదారులకు రూ. 3వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. OneCard క్రెడిట్ కార్డ్ EMI యూజర్లు రూ.1,250 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. OnePlus 10R 5Gని అన్ని ప్రధాన క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌లు, వన్‌కార్డ్‌లో అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, ఇతర ఆఫ్‌లైన్ పార్టనర్ స్టోర్‌ల ద్వారా 6 నెలల వరకు నో-కాస్ట్ EMIతో కొనుగోలు చేయవచ్చు.

Read Also : OnePlus Nord CE 3 Lite : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?