వన్ ప్లస్ 7 ప్రొ : ఈ స్మార్ట్ ఫోన్‌లో 3 ఫీచర్లు మిస్సింగ్!

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే 14, 2019న ఇండియన్ మార్కెట్లలో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 7 సిరీస్ రిలీజ్ కానుంది.

  • Published By: sreehari ,Published On : May 7, 2019 / 02:46 PM IST
వన్ ప్లస్ 7 ప్రొ : ఈ స్మార్ట్ ఫోన్‌లో 3 ఫీచర్లు మిస్సింగ్!

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే 14, 2019న ఇండియన్ మార్కెట్లలో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 7 సిరీస్ రిలీజ్ కానుంది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే 14, 2019న ఇండియన్ మార్కెట్లలో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 7 సిరీస్ రిలీజ్ కానుంది. అధికారిక లాంచ్ కు ముందే.. వన్ ప్లస్ 7 ప్రొ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి కీలక ఫీచర్లు లీకయ్యాయి. ప్రత్యేకించి.. HDR 10+ స్ర్కీన్, ట్రిపుల్ రియర్ కెమెరా యూజర్లను ఎంతో ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. వన్ ప్లస్ కంపెనీ.. వన్ ప్లస్ 7 ప్రొ స్మార్ట్ ఫోన్ లో కొన్ని కీలక మార్పులతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు ధీటుగా వన్ ప్లస్ సిరీస్ ను విడుదల చేయనుంది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లలో శాంసంగ్ (గెలాక్సీ S10e), ఆపిల్ (iphone XR)కు పోటీగా వన్ ప్లస్ 7 ప్రొను కంపెనీ రిలీజ్ చేస్తోంది. సరికొత్త డిజైన్, ఆకట్టుకునే స్పెషిఫికేషన్లతో రిలీజ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ లో కొన్ని ఫీచర్లు మిస్ కానున్నాయి. అవే.. వైరలెస్ ఛార్జింగ్, ఐపీ సర్టిఫికేషన్, 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఫీచర్లు వన్ ప్లస్ ప్రియులకు అందుబాటులో ఉండకపోవచ్చు. 

వైర్ లెస్ ఛార్జింగ్ : 
వన్ ప్లస్ లవర్స్ ను అమితంగా ఆకట్టుకునే ఫీచర్లలో వైరలెస్ ఛార్జింగ్ ఫీచర్ ఒకటి. వన్ ప్లస్ 7 ప్రొ స్మార్ట్ ఫోన్ లో కంపెనీ ఈ ఫీచర్ ను మిస్ చేయనుంది. గ్లాస్ ప్యానెల్స్ ఉన్నప్పటికీ.. వైరలెస్ ఛార్జింగ్ లేకపోవడం యూజర్లకు నిరాశ కలిగించే విషయమే. వన్ ప్లస్ 7 సిరీస్ లో ఈ వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ ను స్కిప్ చేయనున్నట్టు కంపెనీ సీఈఓ పీటె లౌ తెలిపారు. 

ఐపీ సర్టిఫికేషన్ : 
వన్ ప్లస్ 7 సిరీస్ లో వాటర్ రిసిస్టన్స్ ఆటంకం కలిగిస్తోంది. కంపెనీ ప్రమాణాలకు తగిన విధంగా లేకపోవడం, ఐపీ సర్టిఫికేషన్ కూడా ఇందుకు కారణంగా చెప్పువచ్చు. ఎన్నో ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు వాటర్, డస్ట్ రిసిస్టన్స్ కోసం ఐపీ68 లేదా ఐపీ67 సర్టిఫికేషన్ తో రిలీజ్ అవుతున్నాయి. IP68 రేటింగ్ స్మార్ట్ ఫోన్లు.. 1.5మీటర్ల నీటిలో 30 నిమిషాల వరకు ఉన్నా ఎలాంటి ప్రభావం ఉండదు. దుమ్ము, మురికి, ఇసుక నుంచి ఫోన్ రిసిస్టన్స్ కోసమే ఈ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఐపీ సర్టిఫికేషన్ ఉంటే.. డివైజ్ కాస్ట్ మరింత పెరుగుతుందని వన్ ప్లస్ క్లారిటీ కూడా ఇచ్చింది. 

3.5mm హెడ్ ఫోన్ జాక్ :
వన్ ప్లస్ 7 సిరీస్ లో కూడా ఐఫోన్ల మాదిరిగా హెడ్ ఫోన్ జాక్3.5ఎంఎంను తొలగిస్తోంది. ఐఫోన్ నాచ్ డిసిప్లే మాత్రమే కాదు.. వన్ ప్లస్ 6టీలో కూడా 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్ మిస్ కానుంది. దీనికి బదులుగా ఆడియో కోసం కంపెనీ.. వన్ ప్లస్ 7 ప్రొలో టైప్-సి బుల్లెట్స్ ను డిజైన్ చేసింది.