OnePlus 9 Discounts : వన్+ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

భారతీయ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

OnePlus 9 Discounts : వన్+ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Oneplus 9 And Oneplus 9 Pro Available At Massive Discounts In India

OnePlus 9 Discounts : భారతీయ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. OnePlus 9, OnePlus 9 Pro, OnePlus Nord CE 5G స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై ఈ భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఐసీఐసీఐ (ICICI) బ్యాంకు కార్డులతో వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసినవారికి రూ. 8వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందించనుంది.

OnePlus Nord CE 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1500 డిస్కౌంట్‌ పొందవచ్చు. వన్+ కొనుగోలుదారులు రూ. 5వేల వరకు అమెజాన్‌ కూపన్‌ కూడా పొందవచ్చు. OnePlus 9, OnePlus 9 Pro, OnePlus Nord CE 5G స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై ఈ అమెజాన్ అందించే కూపన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

OnePlus 9 Pro :
OnePlus 9 Pro స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ICICI బ్యాంక్ కార్డ్, EMI లావాదేవీలపై రూ. 5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. 9 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం అందిస్తోంది. అమెజాన్‌ కూపన్‌ కోడ్‌ రూ. 5,000తో మొత్తంగా రూ. 10 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

OnePlus 9 :
OnePlus 9 స్మార్ట్‌ఫోన్‌ను ICICI బ్యాంక్ కార్డ్, EMI లావాదేవీలపై రూ. 8,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 9 నెలల No-Cost EMI కూడా పొందవచ్చు. అమెజాన్‌ కూపన్‌ కోడ్‌ రూ. 5,000 కూడా పొందవచ్చు. దాంతో మొత్తంగా రూ. 13 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. OnePlus.in వెబ్ సైట్లో కూడా ఈ ఆఫర్ పొందవచ్చు.

OnePlus Nord CE 5G :
OnePlus Nord CE 5G బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఇది ఒకటి.. ఈ ఫోన్‌పై అమెజాన్‌ రూ.1,500 వరకు ఆఫర్ చేస్తోంది. ICICI బ్యాంకు కార్డులపై 3 నెలల No-Cost ఫెసిలిటీ కూడా అందిస్తోంది. ఈ డీల్ OnePlus.in, Amazon రెండు వెబ్ సైట్లలో అందుబాటులో ఉంది.

Read Also : OnePlus Foldable Smartphone : వన్‌+ నుంచి మడతబెట్టే ఫోన్.. ఒకటి కాదు.. మూడు స్ర్కీన్లు అంట!