Amazon Sale : OnePlus 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. OnePlus 9, OnePlus 9 Pro స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది.

Amazon Sale : OnePlus 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Oneplus 9 Pro, Oneplus 9 To Be Available With Massive Discounts

Amazon Great Indian Festival sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లతో సహా వివిధ ప్రొడక్టులపై ఎన్నడూ లేని డీల్ అందిస్తోంది. అందులో OnePlus 9, OnePlus 9 Pro స్మార్ట్ ఫోన్ డీల్ ఒకటి.. అమెజాన్ సేల్ లో భాగంగా వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్లపై భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. క్యాష్ బ్యాక్ కూడా ఆఫర్ చేస్తోంది. అమెజాన్ వెబ్ సైట్లో వివరాల ప్రకారం.. OnePlus 9Pro రూ. 50,000 లోపు అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో రూ. 64,999 వద్ద లాంచ్ అయింది. సుమారు రూ.15,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. OnePlus 9 అమెజాన్ సేల్ సమయంలో రూ.40,000 లోపు అందుబాటులో ఉండనుంది. దాదాపు రూ. 10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Bahubali : బాహుబలి కలెక్షన్స్ పై దర్యాప్తు.. ట్యాక్స్ చెల్లించలేదా??

స్మార్ట్ ఫోన్లపై డీల్స్ ఇవే :
వన్‌ప్లస్ 9pro, వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఎప్పటివరకూ అందుబాటులో ఉంటుందో ఈ-కామర్స్ దిగ్గజం వెల్లడించలేదు. అయితే, వన్‌ప్లస్‌ 9 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. Oneplus 9pro మోడల్.. 8GB RAM + 128GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడళ్లలో రూ. 69,999 ధరతో అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా OnePlus 9 ఫోన్ 8GB, 12GB RAM మోడళ్లలో వస్తుంది. ఇందులో హై వేరియంట్ మోడల్ ధర రూ .54,999కు అందుబాటులో ఉండనుంది.

వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు హాసెల్‌బ్లాడ్ (Hasselblad) ట్యూనింగ్‌ కెమెరాలతో వచ్చాయి. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ద్వారా పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ రెండు ఫోన్‌లు 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. వార్ప్ ఛార్జ్ 65T ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. వన్‌ప్లస్ 9 ప్రో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

వన్‌ప్లస్ 9 మోడల్.. 6.55-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. అలాగే వన్ ప్లస్ 9pro మోడల్ కొంచెం 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో కొంచెం పెద్దదిగా ఉంటుంది. వన్‌ప్లస్ 9proలో కెమెరాలే హైలైట్. సోనీ IMX789 సెన్సార్‌తో 48MP కెమెరాతో పాటు 50MP పాటు సోనీ IMX766 సెన్సార్‌తో 8MP టెలిఫోటో సెన్సార్ 2MP మోనోక్రోమ్ సెన్సార్‌ని కలిగి ఉంది. మరోవైపు, వన్‌ప్లస్ 9 సోనీ IMX689 సెన్సార్‌తో పాటు 48MP కెమెరాను 50MP సోనీ IMX766 సెన్సార్ 2MP మోనోక్రోమ్ సెన్సార్‌తో వచ్చింది.
Amazon : ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0 వివాదంపై స్పందించిన అమెజాన్