OnePlus Ace 2 Pro Launch : 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో సిరీస్.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్..!

OnePlus Ace 2 Pro Launch : వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో లాంచ్ డేట్ లీక్ అయింది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCతో రానుంది.

OnePlus Ace 2 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus Ace 2 Pro) ఏస్ 2 ప్రో లాంచ్ అతి త్వరలో జరుగుతుంది. లాంచ్ తేదీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. చైనీస్ టిప్‌స్టర్ లేటెస్ట్ ఏస్ సిరీస్ ఫోన్ జూలై లేదా ఆగస్టులో అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. వన్‌ప్లస్ Ace 2 Pro సిరీస్ ఒప్పో స్మార్ట్‌ఫోన్ క్లోజ్ కాపీగా వస్తుందని చెప్పవచ్చు.

1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC, వన్‌ప్లస్ Ace 2 Proకి పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. ఒప్పో రెనో 10 Pro+ 5G 6.74-అంగుళాల ఫుల్-HD+ OLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC చైనాలో లాంచ్ అయింది.

Read Also : OnePlus Nord N30 5G : వన్‌ప్లస్ నార్డ్ N30 5G సిరీస్ ఫోన్ స్పెషిఫికేషన్లు లీక్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Weiboలో OnePlus Ace 2 Pro లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. టిప్‌స్టర్ ప్రకారం.. హ్యాండ్‌సెట్ ఒప్పో రెనో 10 ప్రో+ వంటి డిస్ప్లే స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. వన్‌ప్లస్ Ace 2 Pro కర్వడ్ ఎడ్జ్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్ప్లే 1.5K రిజల్యూషన్, 1440Hz పల్స్ వెడల్పు మాడ్యులేషన్ (PWM) ఫ్రీక్వెన్సీని కూడా అందిస్తుందని చెప్పవచ్చు. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా అందిస్తుంది.

OnePlus Ace 2 Pro Launch Timeline Leaked, Said to Offer 100W Fast Charging

100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో జూలై లేదా ఆగస్టులో చైనాలో లాంచ్ అవుతుందని అంచనా. వన్‌ప్లస్ Ace Pro భారతీయ మార్కెట్లో OnePlus 10Tగా రిలీజ్ అయింది. వన్‌ప్లస్ Ace 2 Pro దేశంలో OnePlus 11Tగా వస్తుందని భావిస్తున్నారు. అయితే, OnePlus స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించే ప్లాన్లను ఇంకా వెల్లడించలేదు.

Oppo Reno 10 Pro+ బేస్ 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,899 (దాదాపు రూ. 45వేలు) ప్రారంభ ధర ట్యాగ్‌తో గత వారం చైనాలో లాంచ్ అయింది. 6.74-అంగుళాల ఫుల్-HD+ (1,240×2,772 పిక్సెల్‌లు) OLED కర్వ్డ్ స్క్రీన్ డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది.

ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో పాటు 16GB వరకు LPDDR5 ర్యామ్‌తో అందిస్తుంది. 64MP పెరిస్కోప్ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32MP సెల్ఫీ షూటర్, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్ ఒప్పో Reno 10 Pro+ ఇతర స్పెసిఫికేషన్‌లతో రానుంది. 100W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో 4,700mAh సెల్ సపోర్టు అందిస్తుంది.

Read Also : Vivo V29 Pro Series : వివో V29 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు