OnePlus Jio 5G Support : వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో జియో 5G సపోర్టు.. ఏయే ఫోన్ మోడల్స్ ఉన్నాయంటే? ఇదిగో ఫుల్ లిస్ట్.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

OnePlus Jio 5G Support : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) మరిన్ని OnePlus ఫోన్‌లకు Jio 5G నెట్‌వర్క్ సపోర్ట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది.

OnePlus Jio 5G Support : వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో జియో 5G సపోర్టు.. ఏయే ఫోన్ మోడల్స్ ఉన్నాయంటే? ఇదిగో ఫుల్ లిస్ట్.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

OnePlus brings Jio 5G to more smartphones_ Jio 5G Support Phone names, Here is the List

OnePlus Jio 5G Support : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) మరిన్ని OnePlus ఫోన్‌లకు Jio 5G నెట్‌వర్క్ సపోర్ట్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. వన్‌ప్లస్ మోడళ్లలో OnePlus 10 సిరీస్, OnePlus 9R, OnePlus 8 సిరీస్, Nord, Nord 2T, Nord 2, Nord CE, Nord CE 2, Nord CE 2 Lite ఉన్నాయి. OnePlus ఫోన్‌లకు Jio 5G స్వతంత్ర (SA) టెక్నాలజీని అందించడానికి కంపెనీ Reliance Jioతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

OnePlus డివైజ్ కలిగిన వినియోగదారులు జియో 5G సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఉచితంగా Jio 5Gని పొందవచ్చు. రిలయన్స్ Jio 5G SA నెట్‌వర్క్ ప్రస్తుతం ఢిల్లీ-NCR, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, నాథ్‌ద్వారాతో పాటు గుజరాత్‌లో అందుబాటులో ఉంది.

Jio True 5G మొత్తం 33 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ ఇండియా సీఈఓ, ఇండియా రీజియన్ హెడ్ నవనిత్ నక్రా మాట్లాడుతూ.. భారత్‌‌లో కమ్యూనిటీకి 5G టెక్నాలజీని తీసుకునేందుకు జియో బృందంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 5G టెక్నాలజీతో యూజర్లు వేగవంతమైన ఇంటర్నెట్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రావడంతో OnePlus 5G R&Dలో ఆధిపత్యాన్ని చలాయిస్తోంది.

OnePlus brings Jio 5G to more smartphones_ Jio 5G Support Phone names, Here is the List

OnePlus brings Jio 5G to more smartphones_ Jio 5G Support Phone names

Read Also : OnePlus Phone Updates : 2023 నుంచి ఆ వన్‌ప్లస్ ఫోన్లలో 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్.. మీ ఫోన్ మోడల్ కూడా ఉండొచ్చు.. చెక్ చేసుకోండి..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు 5G డివైజ్‌లను అందించడంలో అత్యంత వేగంగా నిలిచింది. OnePlus 5G స్మార్ట్‌ఫోన్‌ల మొదటి లైనప్‌ను 2020లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఏప్రిల్ 2020లో OnePlus 8 సిరీస్‌తో వచ్చిన స్మార్ట్‌ఫోన్‌లన్నీ 5Gకి రెడీగా ఉన్నాయి. భారతీయ యూజర్లు 5G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జియోతో కలిసి పనిచేస్తున్నట్లు OnePlus తెలిపింది. మిగిలిన OnePlus ఫోన్లలో OnePlus 9, OnePlus 9, OnePlus 9RT త్వరలో 5Gని పొందుతాయని కంపెనీ తెలిపింది.

OnePlus భారత్ మార్కెట్లో తొమ్మిదవ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటోంది. డిసెంబర్ 13, 18 మధ్య వార్షికోత్సవ సేల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సేల్‌లో భాగంగా కొనుగోలుదారులు రూ.10,800 వరకు విలువైన క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ పొందవచ్చు. OnePlus ప్రకటించినట్లుగా మొదటి 1000 మంది లబ్ధిదారులు రూ. 1,499 విలువైన కాంప్లిమెంటరీ రెడ్ కేబుల్ కేర్ ప్లాన్‌, రూ. 399 విలువైన Jio Saavn Pro ప్లాన్‌ను పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy S22 : 55 సెకన్లలో శాంసంగ్ గెలాక్సీ S22 ఫోన్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఏకంగా 4 సార్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!