OnePlus Jio 5G Support : వన్‌ప్లస్‌ ఫోన్లలోనూ జియో 5G సపోర్టు.. మీ ఫోన్ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్టు ఇదిగో..!

OnePlus Jio 5G Support : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ (OnePlus) ఫోన్లలో రిలయన్స్ జియో (Reliance Jio) ఫోన్ సపోర్టు అందిస్తోంది. OnePlus స్మార్ట్‌ఫోన్‌లకు Jio 5G స్వతంత్ర (SA) సాంకేతికతను తీసుకొచ్చేందుకు OnePlus, Reliance Jio కలిసి పనిచేస్తున్నాయి.

OnePlus Jio 5G Support : వన్‌ప్లస్‌ ఫోన్లలోనూ జియో 5G సపోర్టు.. మీ ఫోన్ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్టు ఇదిగో..!

OnePlus brings support for Jio 5G to most of its phones_ check the full list

OnePlus Jio 5G Support : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ (OnePlus) ఫోన్లలో రిలయన్స్ జియో (Reliance Jio) ఫోన్ సపోర్టు అందిస్తోంది. OnePlus స్మార్ట్‌ఫోన్‌లకు Jio 5G స్వతంత్ర (SA) సాంకేతికతను తీసుకొచ్చేందుకు OnePlus, Reliance Jio కలిసి పనిచేస్తున్నాయి. OnePlus 10 Series, OnePlus 9R, OnePlus 8 సిరీస్‌లతో పాటు Nord, Nord 2T, Nord 2, Nord CE, Nord CE 2, Nord CE 2 Lite వినియోగదారులు ఇప్పటినుంచి Jioని టెస్టింగ్ చేయవచ్చునని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

మీరు ఉండే ప్రాంతాల్లో 5G SA కనెక్టివిటీ ఉచితంగా పొందవచ్చు. OnePlus డిసెంబర్ 13, డిసెంబర్18 మధ్య OnePlus వార్షికోత్సవ సేల్ కూడా నిర్వహిస్తుంది. కస్టమర్‌లు రూ. 10,800 వరకు విలువైన క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను పొందవచ్చు. మొదటి వెయ్యి మంది లబ్ధిదారులు అదనంగా రూ. 1499 విలువైన రెడ్ కేబుల్ కేర్ ప్లాన్, రూ. 399 విలువైన జియో సావ్న్ ప్రో ప్లాన్‌ (Jio Saavn Pro plan)ను అందుకోవచ్చు. ప్రస్తుతం, జియో ఢిల్లీ-NCR, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణె, నాథ్‌ద్వారాలో 5G SAని రిలీజ్ చేస్తోంది. తమ ‘ట్రూ 5G’ గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. 5G నెట్‌వర్క్ విస్తృతంగా రెండు మోడ్‌లలో అందుబాటులో ఉంది.

OnePlus brings support for Jio 5G to most of its phones_ check the full list

OnePlus brings support for Jio 5G to most of its phones_ check the full list

Read Also :  OnePlus Phone Updates : 2023 నుంచి ఆ వన్‌ప్లస్ ఫోన్లలో 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్.. మీ ఫోన్ మోడల్ కూడా ఉండొచ్చు.. చెక్ చేసుకోండి..!

స్వతంత్ర (SA), నాన్-స్టాండలోన్ (NSA) వంటి NSA నెట్‌వర్క్ ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలపై అందుబాటులో ఉంది. ఇప్పటికే ఉన్న 4G టవర్, హై-ఇంటర్నెట్ వేగాన్ని అందించేందుకు SA నెట్‌వర్క్ కొత్త నిర్మాణాన్ని చేపట్టనుంది. అర్హత ఉన్న సర్కిల్‌లలోని జియో వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో 5Gని ఉచితంగా పరీక్షించవచ్చు.

వినియోగదారులు యాక్టివ్ ప్రీపెయిడ్ (రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్) లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ఉన్నారని నిర్ధారించుకోవాలి. వినియోగదారులు 5G ప్రాంతంలో అందుబాటులో ఉంటే ఆటోమాటిక్‌గా గుర్తించాలి. లేదంటే, యాప్ ఎగువన వెల్‌కమ్ ఆఫర్ కోసం My Jio యాప్‌ని ఓపెన్ చేయవచ్చు. ఇంకా అందుబాటులో లేకుంటే, వినియోగదారులు Jio వెల్‌కమ్ ఆఫర్‌కి ఇన్విటేషన్ అందుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Jio 5G) సపోర్ట్‌ను అన్‌లాక్ చేసేందుకు Apple iPhoneలకు ఇంకా అప్‌డేట్ అందుకోలేదు. అప్పటివరకూ ఐఫోన్ యూజర్లు వేచి చూడాల్సిందే.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus 11 Series : వన్‌ప్లస్ 11 ఫోన్ కంప్లీట్ డిజైన్ లీక్.. ఫీచర్లు అదుర్స్.. లాంచ్ ఎప్పుడంటే?