OnePlus Android TV in India : వన్‌ప్లస్ నుంచి కొత్త 4K ఆండ్రాయిడ్ టీవీ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
OnePlus Android TV in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి ఆండ్రాయిడ్ టీవీ వచ్చేసింది.. భారతీయ మార్కెట్లో (శుక్రవారం) డిసెంబర్ 9న భారతీయ మార్కెట్‌లో 55-అంగుళాల 4K డిస్‌ప్లేతో ఫుల్-రేంజ్ స్పీకర్లు, ఆక్సిజన్‌ప్లే 2.0తో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది.

OnePlus Android TV in India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి ఆండ్రాయిడ్ టీవీ వచ్చేసింది.. భారతీయ మార్కెట్లో (శుక్రవారం) డిసెంబర్ 9న భారతీయ మార్కెట్‌లో 55-అంగుళాల 4K డిస్‌ప్లేతో ఫుల్-రేంజ్ స్పీకర్లు, ఆక్సిజన్‌ప్లే 2.0తో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 39,999లతో అందుబాటులో ఉంటుంది. OnePlus.in, Amazon.in, Flipkart అలాగే OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, అన్ని ప్రధాన ఆఫ్‌లైన్ భాగస్వామి స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఈ కొత్త OnePlus TV 55 Y1S ప్రో క్లాసీ బెజెల్-లెస్ డిజైన్, అనేక స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది. OnePlus TV కొన్ని ముఖ్య ఫీచర్లలో 4K UHD డిస్‌ప్లే, 24W వరకు ఫు్-రేంజ్ స్పీకర్లు, ఆక్సిజన్‌ప్లే 2.0 లేటెస్ట్ వెర్షన్, ఇతర కంటెంట్‌తో వస్తుంది. OnePlus TV 55 Y1S Pro డిసెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా.. కంపెనీ ICICI బ్యాంక్ కార్డ్‌లతో యూజర్లకు రూ. 3వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. అదనంగా, OnePlus అన్ని బ్యాంకు లావాదేవీలపై 9 నెలల వరకు నో-కాస్ట్ EMIని అందిస్తోంది.

OnePlus launched a new 55-inch 4K Android TV in India, priced at Rs 39,999
మరిన్ని ఫీచర్లు ఇవే :
స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 4K UHD డిస్‌ప్లేతో వస్తుంది. 10-బిట్ కలర్ డెప్త్‌ను బిలియన్ కన్నా ఎక్కువ కలర్లలో ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతమైన రంగును అందిస్తుంది. HDR10+, HDR10, HLG ఫార్మాట్‌ను కూడా అందిస్తుంది. మెరుగైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందించడంలో సాయపడుతుందని కంపెనీ పేర్కొంది. OnePlus TV అధునాతన గామా ఇంజిన్‌తో వస్తుంది. డైనమిక్ కాంట్రాస్ట్, వైబ్రెంట్ కలర్‌తో అల్ట్రా-క్లియర్ కంటెంట్‌ను అందించేందుకు విజువల్స్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే MEMC టెక్నాలజీ కలిగి ఉంది.
OnePlus TV 55-అంగుళాల డాల్బీ ఆడియో ద్వారా పనిచేస్తుంది. సినిమాటిక్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 24W వరకు అవుట్‌పుట్‌తో ఫుల్-రేంజ్ స్పీకర్‌లను కూడా అందిస్తుంది. సౌండ్ ప్రొఫైల్, సినిమాటిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. OnePlus TV 55 Y1S Proకి ఆక్సిజన్‌ప్లే 2.0 ఆధారంగా Android TV 10.0 సపోర్టు అందిస్తుంది. వన్‌ప్లస్ Connect 2.0 యాప్ ద్వారా నేరుగా కిడ్స్ మోడ్‌తో సహా అనేక ఫీచర్లను అందిస్తుంది.
వినియోగదారులు తమ పిల్లలు టెలివిజన్‌లో చూస్తున్న కంటెంట్‌ను కంట్రోల్ చేస్తుంది. అదనంగా, OnePlus Connect యాప్ యూజర్లు తమ OnePlus స్మార్ట్ టీవీని నిర్ణీత గంటలో ఆటోమాటిక్‌గా ఆఫ్ చేసేందుకు ప్రత్యేక సమయాన్ని సెట్ చేయవచ్చు. OxygenPlay 2.0 230కి పైగా లైవ్ టెలిక్యాస్ట్ ఛానెల్‌లు, లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్ అప్‌డేట్‌లకు ఇన్‌స్టంట్ యాక్సస్ అందిస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..