ఒక్క ఐడియా ఇవ్వండి.. వన్ ప్లస్ ఫోన్ గెలవండి

ఒక్క ఐడియా ఇవ్వండి.. వన్ ప్లస్ ఫోన్ గెలవండి

ఆండ్రాయిడ్ వినియోగదారులకు జాక్ పాట్. కేవలం ఒక్క ఐడియా మీ ఫోన్‌నే మార్చేస్తుంది. చైనా ఆధారిత కంపెనీ నుంచి ఉత్మత్తి అవుతోన్న వన్ ప్లస్ ఫోన్‌లకు ఆపరేటింగ్ సిస్టమ్‌(ఓఎస్)గా ఆక్సిజన్ ఓఎస్‌ను వాడుతుంటారు. అయితే ఈ ఓఎస్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని భావించిన యాజమాన్యం ఆ బాధ్యతను వన్ ప్లస్ అభిమానులకే వదిలిపెట్టేసింది. లాజికల్‌గా ఆలోచిస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా సరికొత్త ఐడియాతో మేనేజ్‌మెంట్‌కు సూచిస్తే చాలు. ఆ కొత్త ఫీచర్‌తో కూడిన ఫోన్‌ను విజేతకు బహుకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది వన్ ప్లస్ మేనేజ్‌మెంట్.

వన్ ప్లస్ అభిమానులు వారి ఐడియాలను  Tech section లో ఫిబ్రవరి 22కంటే ముందుగానే పంచుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు మరికొన్నింటికి సమాధానాలు రాసి #PMChallenge పేరుతో పోస్టు చేయాలట.  ఆ ప్రశ్నలు ఇలా ఉంటాయి. వినియోగదారులంటే ఎవరు?, వినియోగదారునికి విలువ ఏంటి?, సాటి ఆండ్రాయిడ్లలో కూడా ఇదే ఫీచర్ ఉంటే నువ్వు ఇచ్చే ఐడియా అంతకంటే బెటర్‌గా ఎలా ఉంది? వాటితో పాటుగా కొత్త ఫీచర్‌ను ఎలా  మెరుగుపరచాలనుకుంటున్నావు? అనేవి లాజికల్‌గా వివరిస్తూ సమాధానమివ్వాల్సి ఉంటుంది. 

ఇంకా ఆ ఫీచర్‌ను ఉపయోగిస్తే స్కీన్ ఎలా మారుతుందో ప్రతీది స్టెప్పుల వారీగా బొమ్మల ద్వారా(design principle post)లో తెలపాలని కోరింది. ఇలా ఎవరైతే మంచి ఐడియాతో వస్తారో.. వారికి వన్ ప్లస్ కొత్త మోడల్‌తో పాటు మార్చి నెల మధ్యలో జరగనున్న కొత్త ఫోన్ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానం అందనుందట.