OnePlus Nord 2T : వన్‌ప్లస్ నుంచి Nord 2T సిరీస్ ఫోన్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్..

OnePlus Nord 2T : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సిరిస్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో లాంచ్ తేదీ కూడా ఫిక్స్ చేసింది కంపెనీ. ఈ నెల జరుగున్న లాంచ్ ఈవెంట్లో OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించనుంది.

OnePlus Nord 2T : వన్‌ప్లస్ నుంచి Nord 2T సిరీస్ ఫోన్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్..

Oneplus Nord 2t India Launch Date Confirmed Check Expected Price, Specifications

OnePlus Nord 2T : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి (OnePlus Nord 2T) సిరిస్ ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో లాంచ్ తేదీ కూడా ఫిక్స్ చేసింది కంపెనీ. ఈ నెల ( మే 19)న జరుగున్న లాంచ్ ఈవెంట్లో OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించనుంది. వన్‌ప్లస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా లాంచ్‌ ఈవెంట్‌ను కంపెనీ ధృవీకరించింది. అయితే మే 19న భారత మార్కెట్లో OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందనే వివరాలను వెల్లడించలేదు.

Nord 2T ఫోన్.. మే 19న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని నివేదిక వెల్లడించింది. OnePlus Nord 2T ఈ నెల ప్రారంభంలో నేపాల్‌లో 90Hz రిఫ్రెష్ రేట్ Full HD+ రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కోసం టాప్ లెఫ్ట్ కార్నర్ లో హోల్-పంచ్ కటౌట్ ఉంది. Nord 2T MediaTek డైమెన్సిటీ 1300 SoCతో వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త MediaTek చిప్‌సెట్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. SoC 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

Oneplus Nord 2t India Launch Date Confirmed Check Expected Price, Specifications (1)

Oneplus Nord 2t India Launch Date Confirmed Check Expected Price, Specifications

మైక్రో SD కార్డ్ లేదా 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ సపోర్టు లేదు. ఈ ఫోన్ 4500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. నార్డ్ 2 65W ఫాస్ట్ ఛార్జింగ్ కన్నా అప్‌గ్రేడ్ చేసిన 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆక్సిజన్ OS 12 బాక్స్‌తో వస్తుంది. వెనుకవైపు.. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి మద్దతుతో 50MP సోనీ IMX766 ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్‌తో కలిసి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, Nord 2Tలో 32MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉంది.

Nord 2T నేపాల్‌లో NPR 64,999కి లాంచ్ అయింది. భారత కరెన్సీలో దాదాపు రూ. 40,600 ఉంటుందని అంచనా. భారత్ మార్కెట్లో OnePlus 10R ధర రూ. 38,999 నుంచి అందుబాటులో ఉంది. Nord 2T స్మార్ట్ ఫోన్ కూడా ఇదే ధరకు దగ్గరలో ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : Google Pixel 6a : గూగుల్ పిక్సల్ 6a వచ్చేసింది.. ఇండియాకు ఎప్పుడంటే?