OnePlus Nord 2T : ఈ నెలాఖరులో ఇండియాకు వన్‌ప్లస్ Nord 2T ఫోన్.. ఏం ఫీచర్లు ఉండొచ్చుంటే?

వన్ ప్లస్ నుంచి భారత మార్కెట్లోకి Nord T సిరీస్ వస్తోంది. జూన్ నెలాఖరులో OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

OnePlus Nord 2T : ఈ నెలాఖరులో ఇండియాకు వన్‌ప్లస్ Nord 2T ఫోన్.. ఏం ఫీచర్లు ఉండొచ్చుంటే?

Oneplus Nord 2t Likely Coming To India By June End, Here Is What To Expect

OnePlus Nord 2T : చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి భారత మార్కెట్లోకి Nord T సిరీస్ వస్తోంది. జూన్ నెలాఖరులో OnePlus Nord 2T స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో జులైలో OnePlus Nord 3 డివైజ్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు బ్రాండ్ హ్యాండ్‌సెట్‌కు పూర్తి స్థాయిలో స్మార్ట్ ఫోన్ అందించేందుకు కంపెనీ ప్లాన్ చేయడం లేదని తెలుస్తోంది. OnePlus Nord 2 కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి కంపెనీ దించనున్నట్టు తెలుస్తోంది. గత నెలలో.. బ్రాండ్ గ్లోబల్ మార్కెట్‌లో OnePlus Nord 2Tని నిలిపివేసింది. ఈ నెల చివరి నాటికి ఈ డివైజ్ భారత మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. రూట్‌మైగాలాక్సీ సాయంతో టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ (@passionategeekz) భారత్‌లో లాంచ్ తేదీతో పాటు డివైజ్ ధర ఎంతో కూడా లీక్ చేసింది.

OnePlus Nord 2T జూన్ 27న భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. OnePlus Nord 2T ఇప్పటికే యూరోపియన్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ డివైజ్ స్పెషిఫికేషన్లు గురించి ఎలాంటి ప్రకటన లేదు. OnePlus Nord 2తో పోల్చినప్పుడు స్పెసిఫికేషన్‌ల పరంగా పెద్దగా తేడా లేదు. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ పాత మోడల్ పోలి ఉంటాయి. కొత్త మోడల్‌లో వేగవంతమైన ఛార్జింగ్ స్పీడ్, కొత్త చిప్‌సెట్‌కు మాత్రమే సపోర్టు ఉంది. ఐరోపాలో,స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 1300 SoC ద్వారా పవర్ అందిస్తుంది.12GB RAM, 256GB స్టోరేజీతో వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ప్రస్తుతం OnePlus 10R ఫోన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. పాత మోడల్ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

Oneplus Nord 2t Likely Coming To India By June End, Here Is What To Expect

Oneplus Nord 2t Likely Coming To India By June End, Here Is What To Expect

హుడ్ కింద 5,000mAh యూనిట్‌కు బదులుగా 4,500mAh బ్యాటరీ ఉంది. చాలా మిడ్ రేంజ్ ఫోన్‌లలో ఇదే సపోర్టు ఇస్తుంది. OnePlus Nord 2T Full HD+ రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 90Hz వద్ద రిఫ్రెష్ చేసే AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్ చేస్తుంది. మిడ్ రేంజ్ డివైజ్ స్టీరియో స్పీకర్లతో పాటు అలర్ట్ స్లైడర్ కూడా ఉంది. 50-MP ప్రైమరీ సోనీ IMX766 సెన్సార్, 8-MP సోనీ IMX355 కెమెరా, 2-MP మోనోక్రోమ్ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-MP Sony IMX615 కెమెరా కూడా ఉండనుంది.

భారత మార్కెట్లో OnePlus Nord 2T ధర రూ. 28,999గా ఉంది. 8GB RAM+128GB స్టోరేజ్ మోడల్‌కు కావచ్చు. భారత మార్కెట్లో టాప్-ఎండ్ 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 31,999గా టిప్‌స్టర్ డీల్ అందిస్తోంది. OnePlus రూ. 4,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ అందిస్తోంది. ప్రాథమికంగా యూజర్లు కొత్త OnePlus ఫోన్‌ను రూ. 25వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. OnePlus Nord 2 సేల్ జూలై 3 నుంచి జూలై 5 మధ్య జరుగనుంది. అయితే కంపెనీ మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించలేదు.

Read Also : Xiaomi 12 Series : షావోమీ నుంచి 12S సిరీస్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!