OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?

వన్ ప్లస్ నుంచి Nord సిరీస్ 2T 5G ఫోన్ సేల్ మొదలైంది. ఈ రోజు మధ్యాహ్నం జూలై 5 నుంచి భారత మార్కెట్లో సేల్ అందుబాటులో ఉండనుంది.

OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?

Oneplus Nord 2t Sale In India Today, Will Be Available For As Low As Rs 27,499

OnePlus Nord 2T 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు వన్ ప్లస్ నుంచి Nord సిరీస్ 2T 5G ఫోన్ సేల్ మొదలైంది. ఈ రోజు మధ్యాహ్నం జూలై 5 నుంచి భారత మార్కెట్లో సేల్ అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్స్, కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. కస్టమర్‌లు వన్‌ప్లస్ ఇండియా ఛానెల్‌, అమెజాన్ నుంచి డివైజ్ కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ గత ఏడాదిలో రిలీజ్ అయిన OnePlus Nord 2 సక్సెస్ అయింది. ఈ ఫోన్ Mediatek లేటెస్ట్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌తో వచ్చింది. OnePlus కొత్త Nord ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోంది. OnePlus Nord 2 CE, OnePlus 10Rలో లేని అలర్ట్ స్లైడర్‌ని అందించాలని భావిస్తోంది.

వన్ ప్లస్ నార్డ్ 2T 5G ధర, ఆఫర్లు ఇవే :
వన్ ప్లస్ Nord 2T 5G రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB RAM, 128GB స్టోరేజీ, 12GB RAM, 256GB స్టోరేజీతో వచ్చింది. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.28,999 మరియు రూ.33,999గా ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, క్రెడిట్ కార్డులపై కంపెనీ రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ICICI బ్యాంక్ క్రెడిట్, క్రెడిట్ కార్డ్‌లతో EMI ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే కస్టమర్లు ఈ ఫోన్‌ను రూ.27,499, రూ.32,499లకే కొనుగోలు చేయవచ్చు. OnePlus ఇండియాలో మూడు నెలల వరకు నో-కాస్ట్ EMIని కూడా అందిస్తోంది. అదే బ్యాంక్ ఆఫర్లు Amazonలో అందుబాటులో ఉన్నాయి. OnePlus Nord 2T 5G జాడే ఫాగ్ (ఆకుపచ్చ), గ్రే షాడో (బ్లాక్) రంగులలో వస్తుంది.

Oneplus Nord 2t Sale In India Today, Will Be Available For As Low As Rs 27,499 (1)

Oneplus Nord 2t Sale In India Today

స్పెసిఫికేషన్‌లు ఇవే :
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. OnePlus Nord 2T Full HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్‌లలో అందుబాటులో ఉండనుంది. డిస్‌ప్లే HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. హుడ్ కింద 12GB, 256GB స్టోరేజీతో డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ట్రిపుల్ వెనుక కెమెరాలు లోపల వస్తాయి.

వెనుక కెమెరా సిస్టమ్‌లో 50-MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరాతో పాటు 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2-MP ట్రిపుల్ సెన్సార్ ఉన్నాయి. ప్రైమరీ కెమెరాలో ఫొటోలు, వీడియోల కోసం OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఉంది. ముందు ప్యానెల్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-MP సెన్సార్ ఉంది. ముఖ్య ఫీచర్లు OxygenOS 12.1 ఆధారిత Android 12, 89W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, 4,500mAh బ్యాటరీతో వచ్చింది.

Read Also : OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?