Oneplus Nord2 5G : అమెజాన్‌లో ఈ ఫోన్ అస్సలు మిస్ కాకండి!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘Prime Day Sale’లో భాగంగా ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ గతవారమే లాంచ్ చేసిన OnePlus Nord2 5G స్మార్ట్ ఫోన్ మొదటిసారి అమెజాన్ సేల్‌లో అందుబాటులోకి వచ్చింది.

Oneplus Nord2 5G : అమెజాన్‌లో ఈ ఫోన్ అస్సలు మిస్ కాకండి!

Oneplus Nord 2 Specifications

Oneplus nord2 5g Smartphone : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘Prime Day Sale’లో భాగంగా ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ గతవారమే లాంచ్ చేసిన OnePlus Nord2 5G స్మార్ట్ ఫోన్ మొదటిసారి అమెజాన్ సేల్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తిగల స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ సరికొత్త ఫోన్ అమెజాన్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రారంభం ధర రూ.27,999గా నిర్ణయించారు. వన్ ప్లస్ కంపెనీ అందించే ఒరిజినల్ OnePlus Nord సిరీస్‌లో ఇది మూడో స్మార్ట్ ఫోన్. OnePlus Nord2 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే Amazon వెబ్ సైట్ ద్వారా లేదా OnePlus అధికారిక వెబ్ సైట్లో కూడా కొనుగోలు చేయొచ్చు. అలాగే ఈ కొత్త OnePlus స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవాలంటే OnePlus Red Cable మెంబర్ షిప్ గానీ, Amazon Prime Membership ఉంటే సరిపోతుంది.

Read Also : OnePlus TV: వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు.. మూడు సైజ్‌లలో.. ధర తక్కువే!

ధర ఎంత? డిస్కౌంట్ ఎంతంటే? :
OnePlus Nord2 5G ఫోన్ మూడు మోడల్స్‌లో (6GB+128GB, 8GB+128GB, 12GB+256GB) లభ్యం అవుతోంది. ఒక్కో మోడల్ ధర రూ.27,999, రూ.29,999, రూ.34,999గా ఉన్నాయి. ఈ హ్యాండ్ సెట్ Blue Haze, Gray Sierra, Green Woods మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అయితే ఈ మూడింటిలో Blue Haze, Gray Sierra మోడల్స్ మాత్రమే అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. సేల్ డిస్కౌంట్ ఆఫర్ విషయానికి వస్తే.. HDFC BANK Credit Cards పై రూ.1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. EMI ట్రాన్సాక్షన్స్ కూడా ఆఫర్ చేస్తోంది. HDFC BANK Debit Cards పై కూడా EMI లావాదేవీలతో ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

OnePlus Nord2 5G స్పెషిఫికేషన్లు ఇవే :
– 6.43 అంగుళాల Full-HD+ Fluid AMOLED స్ర్కీన్.
– 20:9 రిఫ్రెష్ రేట్ ఆఫ్ 90Hz, స్ర్కీన్ రెజుల్యుషన్ 1080×2400 ఫిక్సల్స్
– మీడియాటెక్ డైమెన్షిటీ 1200-AI చిప్ సెట్
– Oxygen OS 11.3 ఆధారిత ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
– 4,500mAh డ్యుయల్ సెల్ బ్యాటరీ
– 65watt Warp చార్జ్ అడాప్టర్
– 50MP మెయిన్ కెమెరా, Sony IMX766 ప్రైమరీ సెన్సార్ (బ్యాక్)
– 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ (f/2.25 అప్రెచర్), 2MP మోనోక్రోమ్ సెన్సార్ (f/2.5 అప్రెచర్)
– 32MP Sony IMX615 కెమెరా, (f/2.45 అప్రెచర్).