OnePlus Nord CE 3 : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ కొత్త డిజైన్ లీక్.. 108MP ట్రిపుల్ కెమెరాలు ఉండొచ్చు.. లాంచ్ ఎప్పుడంటే?

OnePlus Nord CE 3 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) త్వరలో OnePlus Nord CE 3 ఫోన్ లాంచ్ చేయాలని భావిస్తోంది. అధికారిక లాంచ్ ముందే.. నార్డ్ CE3 ఫోన్ రెండర్‌లు, స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

OnePlus Nord CE 3 : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ కొత్త డిజైన్ లీక్.. 108MP ట్రిపుల్ కెమెరాలు ఉండొచ్చు.. లాంచ్ ఎప్పుడంటే?

OnePlus Nord CE 3 design leaked, tipped to feature 108MP main camera

OnePlus Nord CE 3 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) త్వరలో OnePlus Nord CE 3 ఫోన్ లాంచ్ చేయాలని భావిస్తోంది. అధికారిక లాంచ్ ముందే.. నార్డ్ CE3 ఫోన్ రెండర్‌లు, స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో మీడియాటెక్ డైమెన్సిటీ 900, ట్రిపుల్ రియర్ కెమెరాలతో వచ్చిన Nord CE 2ని అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. కొత్త OnePlus Nord CE 3 వెనుక మూడు కెమెరాలను ఉంటుందని భావిస్తున్నారు. కానీ, కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుందని లీక్ డేటా వెల్లడించింది.

ఫోన్ రెండర్‌లు OnePlus Nord CE 3ని బ్లాక్ ఫినిషింగ్, హోల్-పంచ్ డిస్‌ప్లేతో కనిపించాయి. వెనుక ప్యానెల్ రెండు పెద్ద కెమెరా కటౌట్‌లను కలిగి ఉంటుందని నివేదిక తెలిపింది. ప్రైమరీ కటౌట్‌లో ప్రధాన కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది. రెండవ కటౌట్‌లో రెండు సెన్సార్లు ఉంటాయి. OnePlus Nord CE 3 డిజైన్ బ్రాండ్ ప్రసిద్ధ OnePlus X, ఇటీవలి ఐఫోన్‌ల మాదిరిగా ఉండనుందిన నివేదిక పేర్కొంది. రెండర్‌లు ప్రోటోటైప్ యూనిట్‌పై ఆధారపడి ఉన్నాయని, అసలు ఫోన్ కొద్దిగా భిన్నంగా ఉండవచ్చని చెప్పవచ్చు. OnePlus లాంచ్‌లో మరిన్ని కలర్ ఆప్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord CE 3 design leaked, tipped to feature 108MP main camera

OnePlus Nord CE 3 design leaked, tipped to feature 108MP main camera

Read Also : OnePlus 10 Pro 5G : భారత్‌లో వన్‌ప్లస్ 10ప్రో 5Gపై బిగ్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్..!

స్పెసిఫికేషన్ల పరంగా.. స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో రానుంది. పాత జనరేషన్ Nord CE 2 AMOLED డిస్‌ప్లేను అందించనుంది. OnePlus Nord CE 3 Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ నుంచి 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చిందని తెలిపింది. వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ 108-MP ప్రైమరీ కెమెరాతో పాటు రెండు 2-MP కెమెరా లెన్స్‌లను కలిగి ఉండవచ్చు. ముందు భాగంలో, 16-MP సెల్ఫీ షూటర్ ఉండవచ్చు.

Nord CE 3 ఇతర ఫీచర్లతో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఉన్నాయి. OnePlus Nord CE 2 ఫిబ్రవరి 2022లో భారత మార్కెట్లో లాంచ్ అయింది. వచ్చే ఏడాది రాబోయే Nord ఫోన్‌కు కంపెనీ ఇదే విధమైన లాంచ్ ప్యాటర్న్‌ని అనుసరించవచ్చు. అయితే ఇప్పటివరకూ ఈ ఫోన్ ధరపై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus 11 Series : వన్‌ప్లస్ 11 సిరీస్ వచ్చేస్తోంది.. అధికారిక లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?