OnePlus Nord CE 3 Lite : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్ అదుర్స్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

OnePlus Nord CE 3 Lite : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఏప్రిల్ 4న చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నుంచి నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.

OnePlus Nord CE 3 Lite : వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్ అదుర్స్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

OnePlus Nord CE 3 Lite design confirmed, teased on Amazon ahead of India launch

OnePlus Nord CE 3 Lite : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఏప్రిల్ 4న చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నుంచి నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. రాబోయే OnePlus ఫోన్ డిజైన్‌తో సహా కొన్ని కీలక వివరాలను అమెజాన్ (Amazon) వెల్లడించింది. సరికొత్త లైమ్ కలర్‌లో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ ఫోన్ చాలా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. అదనంగా, వన్‌ప్లస్ నార్డ్ (CE 3 Lite) చాలా సొగసైన, స్టైలిష్‌గా కనిపిస్తుంది. వెనుక ప్యానెల్‌లో రాబోయే OnePlus ఫోన్‌లో LED ఫ్లాష్‌తో పాటు డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. సెన్సార్‌లు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి, ఇటీవల లాంచ్ చేసిన కొన్ని Realme ఫోన్‌ల మాదిరిగానే వన్‌ప్లస్ ఫోన్ ఉండనుంది. ఫ్రంట్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది కంపెనీ రివీల్ చేయలేదు.

వన్‌ప్లస్ ( Nord CE 3 Lite) ఫోన్ వివరాలను అమెజాన్‌ వెల్లడించింది. అయినప్పటికీ, అమెజాన్ (Amazon Sale) అందించే సేల్ తేదీ లేదా బ్యాంక్ ఆఫర్‌లు కూడా రివీల్ చేయలేదు. వన్‌ప్లస్ మరిన్ని కలర్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. వన్‌ప్లస్ ఇంకా స్పెసిఫికేషన్ వివరాలను వెల్లడించలేదు. కానీ, ఇప్పటికే ఈ ఫోన్ ప్యాక్ చేసే కొన్ని కీలక స్పెషిఫికేషన్లను సూచించాయి.

OnePlus Nord CE 3 Lite design confirmed, teased on Amazon ahead of India launch

OnePlus Nord CE 3 Lite design confirmed, teased on Amazon ahead of India launch

Read Also :  OnePlus 5G Upgrade Days Sale : వన్‌ప్లస్ 5G అప్‌గ్రేడ్ డేస్ సేల్.. వన్‌ప్లస్ 11, 11R ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite ఇటీవల గీక్‌బెంచ్‌లో కనిపించింది. బెంచ్‌మార్కింగ్ సైట్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. రాబోయే OnePlus ఫోన్ ధర సుమారు రూ. 20వేల వరకు ఉంటుంది. లీక్‌ల ప్రకారం.. వన్‌ప్లస్ OnePlus స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 SoCతో పాటు కనీసం 8GB RAM ఆప్షన్‌తో రావొచ్చు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రానుంది. బెంచ్‌మార్క్ లిస్టింగ్ కూడా (Nord CE 3 Lite) డిస్‌ప్లే, కెమెరా, ఛార్జింగ్ మరిన్నింటితో సహా వస్తుందని వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుందని లిస్టింగ్ సూచించింది. FHD+ రిజల్యూషన్, 120hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను అందించే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ Nord CE 3 Lite వెనుక ప్యానెల్‌లో 108-MP ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. రెండు 2-MP సెన్సార్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ కెమెరా గురించి ఇంకా వివరాలు రివీల్ చేయలేదు. కానీ, నార్డ్ CE 3 లైట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీతో సపోర్టుతో లిస్టింగ్ వెల్లడించింది.

Read Also : OnePlus Nord CE 3 Lite India : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?