OnePlus Nord CE 3 Lite India : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 3 Lite India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి భారత మార్కెట్లో ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వెర్షన్ రాబోతోంది. (OnePlus Nord Buds 2) కూడా లాంచ్ కానుంది.

OnePlus Nord CE 3 Lite India : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 3 Lite India launch on April 4_ Everything we know so far

OnePlus Nord CE 3 Lite India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి భారత మార్కెట్లో ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వెర్షన్ రాబోతోంది. (OnePlus Nord Buds 2) కూడా లాంచ్ కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రీమియం OnePlus 11, OnePlus 11Rలను దేశంలో లాంచ్ చేసిన తర్వాత ఈ కొత్త ఫోన్ రాబోతోంది. గత వన్‌ప్లస్ Nord ఫోన్ మాదిరిగానే.. కొత్త Nord CE 3 Lite యూజర్ల కోసం తక్కువ బడ్జెట్‌తో రూపొందించింది.

గత ఏడాదిలో OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ బేస్ 6GB RAM, 128GB స్టోరేజీ ధర రూ.19,999కు లాంచ్ అయింది. ఈ ఏడాదిలో Nord CE 3 Lite ధర దాదాపు అదే రేంజ్‌లో ఉండవచ్చు. వన్‌ప్లస్ OnePlus Nord CE 3 లైమ్ కలర్ ఆప్షన్, ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. రౌండ్ రియర్ కెమెరా మాడ్యూల్‌లతో రానుంది. ఈ ఫోన్‌కి సంబంధించిన ఇతర అధికారిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

OnePlus Nord CE 3 Lite India launch on April 4_ Everything we know so far

OnePlus Nord CE 3 Lite India launch on April 4_ Everything we know so far

Read Also : Best Airtel Plans : రూ. 500లోపు బెస్ట్ ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ 5G డేటా.. ఫుల్ లిస్టు ఇదిగో.. మరెన్నో బెనిఫిట్స్

ఈ ఫోన్ వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. వన్‌ప్లస్ Nord CE 3 ఫీచర్లలో Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 SoC ఉండే అవకాశం ఉంది. అదే చిప్‌సెట్ iQOO Z6, Moto G62, Vivo T1 వంటి మిడ్-బడ్జెట్ ఫోన్‌ల మాదిరిగా ఉండనుంది. Nord CE 3 గరిష్టంగా 8GB RAM, Android 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రావచ్చని సూచిస్తుంది.

OnePlus 6GB/4GB ర్యామ్‌తో వేరియంట్‌ను కూడా రావొచ్చు. OnePlus Nord CE 3 Lite Full-HD+ రిజల్యూషన్‌ని అందించే 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందించగలదు. దీని ముందున్న OnePlus Nord CE 2 Lite, చిన్న 6.59-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ప్యానెల్ 120Hzకి సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు.

OnePlus Nord CE 3 Lite India launch on April 4_ Everything we know so far

OnePlus Nord CE 3 Lite India launch on April 4

వన్‌‌ప్లస్ LCD ప్యానెల్ లేదా AMOLED ప్యానెల్‌తో వస్తుందా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. రెండోది సాధారణంగా మెరుగైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. వెనుక కెమెరా సిస్టమ్ విషయానికి వస్తే.. 108-MP ప్రైమరీ కెమెరా ఉంటుందని సూచిస్తుంది. ట్విట్టర్‌లోని కొంతమంది లీక్‌స్టర్లు 64-MP సెన్సార్ కావచ్చునని అంచనా. OnePlus అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్‌ని యాడ్ చేస్తుందో లేదో చూడాలి. హుడ్ కింద, కొత్త OnePlus ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కంపెనీ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందించనుంది.

Read Also : Redmi Note 12 Launch : మార్చి 30న రెడ్‌మి నోట్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. అద్భుతమైన ఫీచర్లు, భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?