OnePlus Nord CE 3 Lite Price : వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ కీలక ఫీచర్లు లీక్.. భారత్‌లో ఈ 5G ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?
OnePlus Nord CE 3 Lite Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ భారత మార్కెట్లో ఏప్రిల్ 4న లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. లాంచ్ ఈవెంట్‌కు ముందు రాబోయే 5G ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

OnePlus Nord CE 3 Lite key specifications officially confirmed by the company, check leaked India price
OnePlus Nord CE 3 Lite Price : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి.. భారత మార్కెట్లో ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్‌కు ముందే (OnePlus Nord CE 3 Lite) కీలక స్పెసిఫికేషన్‌లను కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఇప్పుడు ఈ 5G ఫోన్ ధరకు సంబంధించి లీకులు ఇప్పటికే బయటకు వచ్చాయి.
వన్ ప్లస్ నార్డ్ CE 3 లైట్ భారత మార్కెట్లో రూ. 21,999 ప్రారంభ ధరతో వస్తుందని టిప్‌స్టర్ పేర్కొంది. నార్డ్ CE 3 లైట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే కొన్ని ప్రారంభ బెనిఫిట్స్ కూడా కంపెనీ అందిస్తోంది. లేటెస్ట్ OnePlus ఫోన్ గురించి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.
వన్‌ప్లస్ నార్డ్ C 3 Lite కీలక స్పెసిఫికేషన్‌లు ఇవే :
వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ద్వారా రానుందని కంపెనీ అధికారికంగా వెబ్‌సైట్‌లో ధృవీకరించింది. 8GB వరకు RAMతో వస్తుంది. OnePlus RAMని వర్చువల్‌గా విస్తరించుకోవచ్చు. మీరు ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించడానికి డివైజ్ అనుమతి ఇస్తే వీలువుతుంది. వన్‌ప్లస్ నుంచి లేటెస్ట్ మిడ్-రేంజ్ 5G ఫోన్ 6.72-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది.
సున్నితమైన స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. వన్‌ప్లస్ Nord CE 3 Liteలో వన్‌ప్లస్ AMOLED లేదా LCD ప్యానెల్‌ను అందజేస్తుందా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అయితే, అంతకుముందు లాంచ్ అయిన ఫోన్‌లో LCD స్క్రీన్ ఉంది. కంపెనీ లేటెస్ట్ మోడల్‌తో కూడా అదే LCD స్ర్కీన్ అందించే అవకాశాలు ఉన్నాయి. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. వెనుకవైపు 108-MP ప్రైమరీ కెమెరాను అందించే అవకాశం ఉంది.

OnePlus Nord CE 3 Lite Price : OnePlus Nord CE 3 Lite key specifications officially confirmed by the company, check leaked India price
పాత వెర్షన్‌లో 64-MP సెన్సార్ కన్నా అప్‌గ్రేడ్ కావొచ్చు. వన్‌ప్లస్ యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కెమెరాకు కొంత ట్యూనింగ్ కూడా చేస్తుందని భావిస్తున్నారు. 5G ఫోన్ హుడ్ కింద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. OnePlus బాక్స్‌లో 67W ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తోంది. దాదాపు 30 నిమిషాల్లో బ్యాటరీని టాప్ అప్ చేస్తుందని కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ కొత్త పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే కలర్ ఆప్షన్లలో రానుంది.
వన్‌ప్లస్ నార్డ్ C 3 లైట్ ధర ఎంతంటే? :
నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ Nord CE 3 బేస్ వేరియంట్ భారత మార్కెట్లో రూ. 21,999 నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ Nord CE 2 Lite భారత మార్కెట్లో రూ. 19,999 ధరతో లాంచ్ అయింది. కొత్త వెర్షన్ ధరను రూ. 2వేలు పెంచుతున్నట్లు సూచిస్తుంది. OnePlus నెక్స్ట్ జనరేషన్ వన్‌ప్లస్ నార్డ్ CE, ఒరిజినల్ OnePlus Nord మోడల్‌లు లాంచ్ అయితే ధరను కూడా పెంచే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ C 3 లైట్ లాంచ్ ఆఫర్ :
వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite కొనుగోలుదారులకు కంపెనీ ప్రారంభ బెనిఫిట్స్ అందించనుంది. OnePlus వివరాల ప్రకారం.. కస్టమర్‌లు ఈ డివైజ్ కొనుగోలుపై ఉచితంగా OnePlus ప్రొడక్టును పొందవచ్చు. అంతేకాదు.. ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్ ఆఫర్‌తో వారంటీ ప్లాన్‌ను కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌లు కూడా పొందవచ్చు. రానున్న రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.