Nord CE 3 Lite : రూ.19,999కే వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G ఫోన్.. నార్డ్ బడ్స్ 2 ధర రూ. 2,999 మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

Nord CE 3 Lite : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ నుంచి సరికొత్త నార్డ్ CE 3 5G ఫోన్, నార్డ్ బడ్స్ ఇయర్‌ఫోన్ లాంచ్ అయ్యాయి. ఈ రెండింటిని భారత మార్కెట్లో సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

Nord CE 3 Lite : రూ.19,999కే వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G ఫోన్.. నార్డ్ బడ్స్ 2 ధర రూ. 2,999 మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

OnePlus Nord CE 3 5G, Nord Buds 2 Launched (Photo : Google)

OnePlus Nord CE 3 Lite Launch in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో ఏప్రిల్ 4న (మంగళవారం) రెండు కొత్త ప్రొడక్టులను లాంచ్ చేసింది. అందులో (Nord CE 3 Lite 5G) ఫోన్, (Nord Buds 2) ఇయర్‌ఫోన్ ఉన్నాయి. Nord CE 3 Lite ఫోన్ కొత్త డిజైన్‌తో పవర్‌ఫుల్ ఫీచర్లతో వచ్చింది. ముఖ్యంగా కెమెరా సెక్షన్‌లో (OnePlus 5G) ఫోన్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు రెండూ గత వెర్షన్ల కన్నా చాలా అప్‌గ్రేడ్ వెర్షన్‌లుగా చెప్పవచ్చు. నార్డ్ CE 3 లైట్ 5G ఫోన్ 108-MP ప్రైమరీ కెమెరాతో వచ్చింది. మరో రెండు కెమెరా సెన్సార్లు ఉన్నాయి. ఒకటి డెప్త్ సెన్సార్ అయితే.. మరొకటి మాక్రో లెన్స్ ఉంది.

నార్డ్ CE 3 Lite రెండు వేరియంట్‌లలో వస్తుంది. బేస్ మోడల్‌లో 8GB (LPDDR4x RAM), 128GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. ఈ 5G ఫోన్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. టాప్-ఎండ్ లేదా రెండవ మోడల్‌లో 8GB (LPDDR4x RAM) ప్లస్ 256GB UFS 2.2 స్టోరేజ్ ఉంది. ఈ మోడల్ ధర రూ.21,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్ ప్యానెల్ లెమన్ కలర్‌తో రిఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఈ ఫోన్ 8GB వర్చువల్ ర్యామ్‌కు సపోర్టుతో వస్తుంది. (OnePlus Nord Buds 2) డివైజ్ రూ. 2999 ధరతో లాంచ్ అయింది. ఇయర్‌బడ్‌లు కూడా లైట్నింగ్ వైట్, థండర్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తాయి.

వన్‌ప్లస్ Nord CE 3 Lite స్పెసిఫికేషన్‌లు ఇవే :
వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G ఫోన్ ప్రస్తుత ట్రెండ్‌‌కు తగినట్టుగా 5G సపోర్టుతో వస్తుంది. Qualcomm Snapdragon 695 5G చిప్‌సెట్‌తో పాటు 8GB వరకు LPDDR4x RAM, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. అదనంగా, 8GB వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా ఆక్సిజన్‌OS 13.1తో రన్ అవుతుంది. ఇందులో 67W SUPERVOOC ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని అందిస్తుంది.

OnePlus Nord CE 3 Lite launched at Rs 19,999, Nord Buds 2 priced at Rs 2,999

Nord CE 3 5G, Nord Buds 2 Launched (Photo : Google)

Read Also :  OnePlus Nord CE 3 : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఇందులోని బాక్స్ 80W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌కు బదులుగా పైన ఉన్న (Asahi Dragontrail Star Glass) స్టార్ గ్లాస్‌తో ప్రొటెక్ట్ చేసేలా 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేను అందిస్తుంది. 60 Hz, 120 Hz రిఫ్రెష్ రేట్ మధ్య మారడానికి ఒక ఆప్షన్ కూడా ఉంది. పక్కన, పవర్ బటన్‌గా రెట్టింపు అయ్యే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇందులో AMOLED ప్యానెల్ లేదు. ఇక, OnePlus ఫోన్‌ వెనుక ప్యానెల్‌లో 108-MP ప్రైమరీ (Samsung HM6) సెన్సార్‌తో పాటు 2-MP డెప్త్ సెన్సార్, 2-MP మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. ముందు భాగంలో, (Nord CE 3 Lite) సెల్ఫీలు, వీడియో కాల్‌లను క్లిక్ చేసే 16-MP కెమెరాను కలిగి ఉంది.

వన్‌ప్లస్ Nord Buds 2 స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ కొత్త బడ్జెట్ నార్డ్ బడ్స్ 2 ఇయర్‌బడ్‌లను కూడా రిలీజ్ చేసింది. ఈ కొత్త ఇయర్‌బడ్‌లు గత వెర్షన్ కన్నా చాలా అప్‌గ్రేడ్ అయ్యాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌తో కూడా వస్తుంది. బడ్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ధరకు తగ్గట్టుగానే బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తాయి. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఒక్క ఛార్జ్‌పై Nord Buds 2 డివైజ్ 7 గంటల 30 నిమిషాల వరకు ప్లే టైమ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. ANC ON చేస్తే.. ఇయర్‌బడ్స్‌ను ఒకే ఛార్జ్‌పై 5 గంటల 30 నిమిషాలు అందిస్తున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ 11 నుంచి Nord Buds 2 సేల్  :

ఇయర్ బడ్స్ చూడటానికి ఫ్లాట్‌గా, షార్ట్ స్టెమ్ లాంటి డిజైన్‌ను కలిగి ఉన్నాయి. చెవులకు బాగా సరిపోయేలా రూపొందించింది. స్టెమ్ పైన టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. మీరు మ్యూజిక్ ప్లే చేయడానికి లేదా పాజ్ చేయడానికి, కాల్‌లకు ఆన్సర్ ఇవ్వడానికి లేదా రిజెక్ట్ చేయడానికి, వాయిస్ అసిస్టెంట్‌ని ఆన్ చేసేందుకు ఈ సర్క్యూలర్ బటన్‌పై Tap చేయొచ్చు. ఇప్పుడు, మ్యూజిక్ ప్లే చేయడానికి పాజ్ చేయడానికి బటన్‌పై ఒకసారి Click చేయండి, రెండుసార్లు Tap చేసిన తర్వాత Next పాటకు మారుతుంది. ట్రిపుల్-ట్యాప్ ద్వారా యూజర్లు ప్రీవియస్ ట్రాక్‌కి తిరిగి వెళ్లవచ్చు. Nord Buds 2 సేల్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల వినియోగదారులు అప్పటివరకూ ఆగాల్సిందే..

Read Also : OnePlus Nord CE Offer : అమెజాన్‌లో అదిరే ఆఫర్.. రూ.20వేల విలువైన వన్‌ప్లస్ 5G ఫోన్.. కేవలం రూ.1,299 మాత్రమే..!