OnePlus Nord CE 3 Lite : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 3 Lite : కొత్త ఫోన్ కోనేందుకు చూస్తున్నారా? అయితే ఏప్రిల్ 4 వరకు ఆగండి.. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే.. వచ్చే నెల ప్రారంభంలో ఈ కొత్త వన్‌ప్లస్ లైట్ వెర్షన్ రాబోతోంది.

OnePlus Nord CE 3 Lite : ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 3 Lite tipped to launch on April 4, key specifications leak online

OnePlus Nord CE 3 Lite : కొత్త ఫోన్ కోనేందుకు చూస్తున్నారా? అయితే ఏప్రిల్ 4 వరకు ఆగండి.. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. అదే.. (OnePlus Nord CE 3 Lite). వచ్చే నెల ప్రారంభంలో ఈ కొత్త వన్‌ప్లస్ లైట్ వెర్షన్ రాబోతోంది. ఈ డివైజ్ అనేక వెరిఫైడ్ సైట్‌లలోనూ అందుబాటులో ఉంది. ఇప్పటికే IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లోనూ కనిపించింది. ఈ మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌పై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ.. ఏప్రిల్ 4న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ Nord CE 3 Lite ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 SoCని ఉపయోగించవచ్చని లిస్టింగ్ సూచిస్తుంది. రూ. 20వేల రేంజ్‌లో చాలా ఫోన్‌లు ఒకే చిప్ ప్యాక్‌ని అందించకపోవచ్చు. కానీ, కంపెనీ Nord CE Lite సిరీస్ రూ. 20వేల సెగ్మెంట్‌లోపు బడ్జెట్ ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంది. ఈ కొత్త వెర్షన్ కూడా అదే రేంజ్ ధర ఉంటుందని భావిస్తున్నారు.

రాబోయే వన్‌ప్లస్ (Android 13 OS)లో రన్ అవుతుందని (Geekbench) లిస్టు సూచిస్తుంది. 8GB RAM ఆప్షన్‌తో కూడా వస్తుంది. లీక్‌లను విశ్వసిస్తే.. వన్‌ప్లస్ (Nord CE 3 Lite) కొన్ని ప్రాంతాలలో కొన్ని పెద్ద అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. కొత్త వెర్షన్ పెద్ద డిస్‌ప్లే, హై-రిజల్యూషన్ కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.

OnePlus Nord CE 3 Lite tipped to launch on April 4, key specifications leak online

OnePlus Nord CE 3 Lite tipped to launch on April 4, key specifications leak online

Read Also : Jio Airtel Vi Offers : 2023లో బెస్ట్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్లాన్లు ఇవే.. ఫుల్ లిస్టు ఇదిగో.. మరెన్నో OTT బెనిఫిట్స్ మీకోసం..!

(OnePlus Nord CE 3 Lite) ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. FHD+ రిజల్యూషన్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో రిలీజ్ అయిన (OnePlus Nord CE 2 Lite) ఫోన్.. చిన్న 6.59-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ప్యానెల్ 120Hzకి సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. వెనుకవైపు 108-MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. పాత వెర్షన్‌లో చూసిన 64-MP సెన్సార్ కన్నా అప్‌గ్రేడ్ అప్షన్‌తో రానుంది.

OnePlus యూజర్లు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. కెమెరాకు కొంత చక్కటి ట్యూనింగ్ కూడా కావాలని భావిస్తున్నారు. ప్రైమరీ కెమెరాతో పాటు రెండు 2-MP సెన్సార్‌లు ఉండవచ్చు. గుడ్ క్వాలిటీతో ఫొటోలను అందించవు. వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite అధికారిక ఫీచర్లు కావు.

హుడ్ కింద, కొత్త OnePlus ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కంపెనీ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. రూ. 20వేల సెగ్మెంట్‌లో 33W ఛార్జింగ్ సపోర్ట్‌కు సపోర్ట్‌ను ఎక్కువగా చూడవచ్చు. ఈ డివైజ్ భారతీయ మార్కెట్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో ప్రస్తుతానికి తెలియదు. వాస్తవానికి ఈ 5G ఫోన్‌ను లాంచ్ చేయాలనుకుంటే.. రాబోయే లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే..

Read Also : Nokia C12 Pro Sale : నోకియా C12 ప్రో సేల్ మొదలైందోచ్.. కేవలం రూ.6,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!