OnePlus Nord Watch : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ వాచ్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ వస్తోంది. భారత మార్కెట్లో OnePlus Nord వాచ్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన ప్రారంభ తేదీని వెల్లడించలేదు.

OnePlus Nord Watch : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ వాచ్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?

Nothing Phone (1) gets new software update with several camera improvements

OnePlus Nord Watch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ వస్తోంది. భారత మార్కెట్లో OnePlus Nord వాచ్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే, కంపెనీ ఇంకా కచ్చితమైన ప్రారంభ తేదీని వెల్లడించలేదు. ఇప్పుడు అమెజాన్ ఇండియా (Amazon India) వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. వన్ ప్లస్ వాచ్ లాంచ్ ఈవెంట్ కూడా దగ్గరలోనే ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం తమ లిస్టులో వాచ్ ధరను ఉంచింది.

అమెజాన్ ద్వారా సేల్ అందుబాటులోకి రానున్నట్టు ధృవీకరించింది. స్మార్ట్‌వాచ్ ధర ఎంత ఉంటుందో అమెజాన్ లిస్టింగ్ వెల్లడించలేదు. కానీ, వన్‌ప్లస్ నార్డ్ వాచ్ ధర రూ. 10వేలు వరకు ఉంటుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ పేర్కొన్నారు. వన్‌ప్లస్ ఇప్పటివరకు వెల్లడించిన ఫీచర్లు బడ్జెట్ వాచీలలో కూడా ఉన్నాయని అన్నారు. నివేదిక ప్రకారం.. ధర చాలా తక్కువగా ఉండవచ్చని పేర్కొంది. వన్‌ప్లస్ నోర్డ్ వాచ్ (Oneplus Nord Watch) రిటైల్ బాక్స్‌కు యాక్సెస్ పొందిందని పేర్కొంది.

Nothing Phone (1) gets new software update with several camera improvements

Nothing Phone (1) gets new software update with several camera improvements

స్మార్ట్‌వాచ్ ధర రూ 6,999గా అమెజాన్ సూచిస్తోంది. కానీ, అసలు ధర దీని కంటే తక్కువగా ఉంటుందని అంచనా. డివైజ్‌లో ఉన్న ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటే.. దీని ధర రూ. 5,000 ఉంటుందని భావించవచ్చు. మరి కొద్ది రోజుల్లో అధికారిక ధరను వెల్లడించే అవకాశం ఉంది. OnePlus ఇప్పటికే ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ను రూ.14,999కి విక్రయిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. OnePlus Nord వాచ్ రిక్టాంగిల్ డయల్‌ను కలిగి ఉంటుంది. స్క్రీన్ 60Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. ఈ డివైజ్100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్టు చేస్తుందని కంపెనీ పేర్కొంది. 1.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న వాచీలతో పోలిస్తే చాలా పెద్దదిగా చెప్పవచ్చు. ఈ వాచ్ AMOLED డిస్‌ప్లేను అందిస్తుందని ధృవీకరించాయి. 500 నిట్‌ల హై బ్రైట్‌నెస్ సపోర్టు అందిస్తుంది. 368 x 448 రిజల్యూషన్‌తో పనిచేస్తుంది.

Nothing Phone (1) gets new software update with several camera improvements

Nothing Phone (1) gets new software update with several camera improvements

డయల్ కుడి వైపున ఒకే నావిగేషన్ బటన్ కూడా ఉంది. OnePlus Nord వాచ్ హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 ట్రాకింగ్, స్టెప్ మానిటరింగ్, మరిన్ని వంటి ఫీచర్లతో వస్తుందని టీజర్‌లు వెల్లడిస్తున్నాయి. ఒకరు వాచ్‌ని ఉపయోగించి వారి ఫోన్ మ్యూజిక్ కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ డివైజ్‌లో ఇండోర్, అవుట్‌డోర్ వాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది. రన్నింగ్‌తో సహా 105 ఫిట్‌నెస్ మోడ్‌లు ఉన్నాయని OnePlus ధృవీకరించింది. యోగా, క్రికెట్ వంటి ఇతర మోడ్‌లు కూడా ఉన్నాయి. మిగతా వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

Read Also : OnePlus Nord Watch : వన్‌ప్లస్ నార్డ్ వాచ్ ఫీచర్లు లీక్.. అన్ని హెల్త్ ఫీచర్లే.. మహిళల కోసం స్పెషల్ ఫీచర్ ఉందట..!