OnePlus ఫోన్ల డేటా చోరీ

OnePlus ఫోన్ల డేటా చోరీ

కెమెరా క్వాలిటితో పాటు మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్ ఫోన్లు డేటా చోరీకి గురయ్యాయి. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ నుంచి యూజర్ల సమాచారం అంటే పేరు, మెయిల్ ఐడీలు వంటివి లీక్ అయ్యాయని అధికారులు తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీలను తయారుచేస్తున్న వన్ ప్లస్ ఉత్పత్తులకు షాక్ తగిలినట్లు అయింది. 

స్మార్ట్ ఫోన్ల వినియోగం, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డేటా చోరీలు అదే స్థాయిలో  పెరుగుతూ వస్తోంది. ముందస్తుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక లూప్ హోల్‌తో ఇట్టే దోచేస్తున్నారు. వన్ ప్లస్ సెక్యూరిటీ టీం తెలిపిన వివరాల ప్రకారం.. ఏదో అనధికారిక పార్టీ కస్టమర్ల డేటాను వన్ ప్లస్ వెబ్ సైట్ నుంచి చోరీ చేసింది. యూజర్ నేమ్, కాంటాక్ట్ నంబర్లు, ఈ మెయిల్, షిప్పింగ్ అడ్రస్ లు వంటివి దొంగిలించారు. 

అంతేకానీ, పాస్ వర్డ్ లు వంటివి సేఫ్ గానే ఉన్నాయని, మనీ ట్రాన్సాక్షన్ ల వంటి వాటికి ఎటువంటి ప్రమాదం లేదని మేనేజ్‌మెంట్ తెలిపింది. అయితే యూజర్లు జాగ్రత్తగా ఉండాలని వన్ ప్లస్ తమ కస్టమర్లకు మెయిల్ రూపంలో హెచ్చరికలు పంపింది. ఈ చోరీకి గురైన కస్టమర్లకు కొద్ది రోజులుగా స్పామ్, ఫిషింగ్ ఈ మెయిల్స్ వంటివి వస్తున్నాయి. 

ఇదెలా జరిగిందనే దానిపై వన్ ప్లస్ యాజమాన్యం పనిచేస్తుంది. ఒకసారి అది తేలిన తర్వాత వివరాలను వన్ ప్లస్ ప్రపంచనాకి తెలియజేస్తుందని అధికారులు తెలిపారు. 
డేటా చోరీకి గురైందని భావిస్తున్నారా:
* డేటా చోరీ జరిగింది కొన్ని వన్ ప్లస్ ఫోన్లు, కొన్ని ఆండ్రాయిడ్ టీవీలకు మాత్రమే అందరూ కంగారూ పడాల్సిన అవసరం లేదు. 
* ఒకవేళ మీ డేటా చోరీకి గురైతే వారికి వన్ ప్లస్ నుంచి అధికారిక మెయిల్ ద్వారా సమాచారం అందజేస్తారు. 
* డేటా చోరీలో ఎటువంటి కీలక సమాచారం పోలేదు. పేమెంట్ వివరాలు, పాస్ వర్డ్‌ల వంటివి భద్రంగానే ఉన్నాయి. 
* వన్ ప్లస్ ఫోన్లు డేటా చోరీకి గురవడం ఇది తొలిసారేం కాదు. గతేడాది జరిగిన డేటా చోరీలో 40వేల వన్ ప్లస్ యూజర్లు హ్యాకింగ్ గురయ్యారు.