OnePlus Nord CE 3 Leak : సరసమైన ధరకే వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 3 Leak : వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ తమ వినియోగదారుల కోసం OnePlus 11 5G, OnePlus 11R 5G మార్కెట్లో లాంచ్ చేసింది. ఆ తర్వాత మరింత సరసమైన (OnePlus Nord CE 3) ధరకే అందించాలని కంపనీ యోచిస్తోంది.

OnePlus Nord CE 3 Leak : సరసమైన ధరకే వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus to launch an affordable Nord CE 3 in India soon, full specifications leaked

OnePlus Nord CE 3 Leak : భారత మార్కెట్లో ప్రీమియం ఫోన్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. స్మార్ట్‌ఫోన్ మేకర్లు సైతం మిడ్-ప్రీమియం ఫోన్లపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ప్రత్యేకించి వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ తమ వినియోగదారుల కోసం OnePlus 11 5G, OnePlus 11R 5G మార్కెట్లో లాంచ్ చేసింది. ఆ తర్వాత మరింత సరసమైన (OnePlus Nord CE 3) ధరకే అందించాలని కంపనీ యోచిస్తోంది. గత ఏడాదిలో (OnePlus Nord CE 2) ఫోన్ జూలైలో లాంచ్ అయింది. ఈ ఫోన్ అధికారిక ప్రకటనకు ముందు.. ఆన్‌లైన్ (MySmartPrice)తో టిప్‌స్టర్ ఆన్‌లీక్ Nord CE 3 ఫోన్ స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది.

ఈ ఫోన్ ముఖ్య ఫీచర్లలో 6.72-అంగుళాల AMOLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 782G SoC, 50-MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉన్నాయి. వన్‌ప్లస్ Nord CE 3లో డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్, Full-HD+ రిజల్యూషన్‌ను అందిస్తుందని నివేదిక పేర్కొంది. బయోమెట్రిక్ సెక్యూరిటీకి ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉండవచ్చు. స్నాప్‌డ్రాగన్ 782 SoC గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజీతో చేయొచ్చు. వెనుక భాగంలో 50MP (IMX890) కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 2MP మాక్రో కెమెరాతో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలకు OnePlus Nord CE 3 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలిపింది.

OnePlus to launch an affordable Nord CE 3 in India soon, full specifications leaked

OnePlus Nord CE 3 Leak : OnePlus to launch an affordable Nord CE 3 in India soon

Read Also : Amazon Holi Sale : అమెజాన్ హోలీ సేల్ మొదలైందోచ్.. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇదే బెస్ట్ టైమ్.. డోంట్ మిస్..!

ఇతర ముఖ్య ఫీచర్లలో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5G, NFCతో 5,000mAh బ్యాటరీ ఉండవచ్చు. Qualcomm Snapdragon 695 చిప్‌సెట్, 6.7-అంగుళాల LCD డిస్‌ప్లేతో పాటు 5000mAh బ్యాటరీతో ఫోన్ వస్తుందని నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ 108MP కెమెరాను కలిగి ఉంటుందని నివేదిక తెలిపింది. ట్రిపుల్ కెమెరాల విషయానికి వస్తే.. బ్లాక్ బాడీని, వెనుకవైపు రెండు బిగ్ రౌండ్ కటౌట్‌లతో రానుందని తెలిపింది. OnePlus Nord CE 3 ధర అస్పష్టంగానే ఉంది. స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ ధర రూ. 20వేల నుంచి రూ. 25వేల వరకు ఉండవచ్చు.

వన్‌ప్లస్ Nord CE 2 గత ఏడాదిలో రూ. 23,999 (6GB RAM + 128GB స్టోరేజీ)తో వచ్చింది. 8GB RAM టాప్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. ప్రస్తుతం, Nord CE 2 వరుసగా రూ. 18,999, రూ. 20,999కి విక్రయిస్తోంది. OnePlus Nord 3 స్పెసిఫికేషన్లు కూడా లీక్ అయ్యాయి. జూన్-జూలైలో ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. ఫుల్-HD+ రిజల్యూషన్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, MediaTek డైమెన్సిటీ 9000 SoC, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. స్పెసిఫికేషన్ల ఆధారంగా Nord 3 ధర రూ. 35వేల లోపు ఉండవచ్చు.

Read Also : Holi Sale 2023 : హోలీ ఫెస్టివల్ సేల్ మొదలైందోచ్.. ఐఫోన్ 14, మ్యాక్‌బుక్ ఎయిర్ 2022, వన్‌ప్లస్ 11R 5G ఫోన్లపై భారీ డీల్స్..!