OnePlus TV: వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు.. మూడు సైజ్‌లలో.. ధర తక్కువే!

సుదీర్ఘ నిరీక్షణ తరువాత, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ ఎట్టకేలకు మూడు సైజుల్లో వన్‌ప్లస్ టీవీ యూ1ఎస్ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసింది. వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీలు 50-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చాయి.

OnePlus TV: వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు.. మూడు సైజ్‌లలో.. ధర తక్కువే!

Oneplus Tv

OnePlus TV U1S Series: సుదీర్ఘ నిరీక్షణ తరువాత, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ ఎట్టకేలకు మూడు సైజుల్లో వన్‌ప్లస్ టీవీ యూ1ఎస్ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేసింది. వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీలు 50-అంగుళాల, 55-అంగుళాల మరియు 65-అంగుళాల వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చాయి. 4కే డిస్‌ప్లేతో హెచ్‌డీఆర్10+, హెచ్ఎల్‌జీ, ఎంఈఎంసీ సపోర్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 30W అవుట్‌పుట్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. పిక్చర్ మరియు సౌండ్ క్వాలిటీ అధ్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

వన్‌ప్లస్ టీవీ U1S సిరీస్ స్మార్ట్ టీవీలన్నీ 10 బైట్ కలర్ డెప్త్ మరియు 93% డిసిఐ-పి 3 కవరేజ్‌తో 4K రిజల్యూషన్‌లో వస్తాయి. వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ టీవీల్లో డాల్బీ ఆడియో, బయటి శబ్దాన్ని తగ్గించడానికి మల్టీకాస్ట్ వంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇదే ఫీచర్లు, ఇదే సైజులు కలిగిన మిగతా కంపెనీ ప్రాడెక్ట్‌లతో పోలిస్తే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.

దీనిలో ప్రారంభ 50 అంగుళాల మోడల్ ధర రూ. 39,999గా ఉండగా.. అదే సమయంలో, వన్‌ప్లస్ టీవీ U1S సిరీస్ 55 అంగుళాల మోడల్ ధర 47,999 రూపాయలు. చివరగా, 65 అంగుళాల మోడల్ ధర 62,999 రూపాయలు. ఈ స్మార్ట్ టీవీలతో పాటు, వన్‌ప్లస్ టీవీ కెమెరాను కూడా విడుదల చేసింది. దీని ధర రూ .2,499.

మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ జాక్ కూడా ఇందులో అందించారు. హెచ్‌డీఎంఐ 2.1, ఈఆర్క్ ఫీచర్‌ను కూడా ఈ టీవీల్లో అందించారు. ఇందులో ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్లు ఉండగా.. నేరుగా వాయిస్ కమాండ్లను కూడా వీటి ద్వారా ఇచ్చుకునే అవకాశం ఉంది. ఇందులో డేటా సేవర్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. వన్ ప్లస్ వాచ్ కంట్రోల్ ద్వారా మీ స్మార్ట్ వాచ్‌ను కూడా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఉంది.

వన్‌ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు మరియు అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ టీవీ జూన్ 10వ తేదీన అందుబాటులోకి రాగా.. మిగిలిన వారికి ఇవాళ(జూన్ 11) నుంచి అందుబాటులోకి వచ్చింది.