OnePlus Pad : వన్‌ప్లస్ నుంచి ఫిబ్రవరి 7న ఫస్ట్ వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus Pad : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి ఫస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ ప్యాడ్ వస్తోంది. ఫిబ్రవరి 7న జరుగబోయే క్లౌడ్ 11 ఈవెంట్లో వన్‌ప్లస్ తమ ప్రొడక్టులను లాంచ్ చేయనుంది.

OnePlus Pad : వన్‌ప్లస్ నుంచి ఫిబ్రవరి 7న ఫస్ట్ వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus will reportedly launch its first-ever tablet, the OnePlus Pad this 7 February

OnePlus Pad : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి ఫస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ ప్యాడ్ వస్తోంది. ఫిబ్రవరి 7న జరుగబోయే క్లౌడ్ 11 ఈవెంట్లో వన్‌ప్లస్ తమ ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. OnePlus 11 5G, 11R 5G స్మార్ట్‌ఫోన్‌లు, OnePlus TV 65 Q2 Pro, OnePlus Buds Pro 2, OnePlus మెకానికల్ కీబోర్డ్‌తో సహా మల్టీ ప్రొడక్టులను లాంచ్ చేస్తున్నట్లు బ్రాండ్ ధృవీకరించింది. ఈ క్లౌడ్ ఈవెంట్‌లో మరో కొత్త డివైజ్ లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ ప్యాడ్ అని పిలిచే మొట్టమొదటి టాబ్లెట్ అని నివేదికలు సూచిస్తున్నాయి.

వన్‌ప్లస్ (OnePlus) ప్యాడ్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ, ఈ బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్‌లో OnePlus 11 5G మైక్రోసైట్‌లో టాబ్లెట్‌ను లిస్టు చేసింది. వన్‌ప్లస్ ప్యాడ్ సంబంధించి కేటగిరీని అప్‌డేట్ చేసింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు ముందు రోజులలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు.. టాబ్లెట్ డ్రాయింగ్‌తో ‘బాక్స్‌లు అన్ని షేప్‌లు వేర్వేరు సైజుల్లో వస్తాయని మాత్రమే చెబుతుంది. OnePlus ప్యాడ్ మూడు వైపులా సన్నని బెజెల్‌లను కలిగి ఉందని భావిస్తున్నారు. ఈ బ్రాండ్ త్వరలో డివైజ్ కు సంబంధించి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. OnePlus టాబ్లెట్‌ను లాంచ్ చేస్తుందని చాలా కాలంగా రుమర్లు వినిపించాయి.

OnePlus will reportedly launch its first-ever tablet, the OnePlus Pad this 7 February

OnePlus will reportedly launch its first-ever tablet, the OnePlus Pad this 7 February

OnePlus ప్యాడ్‌తో, బ్రాండ్ ప్రొడక్టు పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తుంది. భారత మార్కెట్లో ఈ నెల ప్రారంభంలో టాబ్లెట్ ప్రైవేట్ టెస్టింగ్ నిర్వహించింది. 2021లో తిరిగి EUIPO ట్రేడ్‌మార్క్‌ను కూడా పొందింది. OnePlus ప్యాడ్ మార్కెట్లో అందుబాటులో ఉన్న OPPO టాబ్లెట్‌లలో కొత్త వెర్షన్‌గా రాబోతోంది.

అంతేకాదు.. రాబోయే ఈ వన్ ప్లస్ ప్యాడ్ సరసమైన ధరతో అందుబాటులోకి రానుంది. OnePlus ప్యాడ్ కీలక స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఎలాంటి వివరాలను ఆన్‌లైన్‌లో రివీల్ చేయలేదు. లాంచ్ ఈవెంట్ సమయంలో ఈ ప్యాడ్ ఫీచర్లను వెల్లడించే అవకాశం ఉంది. ఈవెంట్ సందర్భంగా వన్‌ప్లస్ టాబ్లెట్‌తో పాటు 11R 5G, 65-అంగుళాల టీవీని లాంచ్ చేయొచ్చునని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈవెంట్‌లో 11 5G, బడ్స్ ప్రో 2 లాంచ్ కానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus 11R India Launch : ఫిబ్రవరి 7న భారత్‌కు వన్‌ప్లస్ 11R ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?