Oppo A16: ఒప్పో ఏ 16 మార్కెట్లోకి వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లతో

దాదాపు చాలా మందికి బడ్జెట్ రేంజ్ లో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలనే అనుకుంటారు. ఫీచర్ల కోసం కొన్ని సార్లు త్యాగం చేసి ఎక్కువ ధరను వెచ్చిస్తుంటారు. కానీ, ఈ సారి అనువైన ఫీచర్లతో..

10TV Telugu News

Oppo A16: దాదాపు చాలా మందికి బడ్జెట్ రేంజ్ లో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలనే అనుకుంటారు. ఫీచర్ల కోసం కొన్ని సార్లు త్యాగం చేసి ఎక్కువ ధరను వెచ్చిస్తుంటారు. కానీ, ఈ సారి అనువైన ఫీచర్లతో అందుబాటు ధరతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో ఏ16ను భారత మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్ల వివరాలిలా ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 11 బేస్డ్ కలర్‌ఓఎస్‌ 11.1 ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్‌లో మొత్తం 4 కెమెరాలున్నాయి. ఫ్రంట్ 8 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరాతో పాటు వెనుక 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2-2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.

4జీబీ ర్యామ్‌తో నడిచే ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఐకేర్‌ మోడ్‌ 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు.

Oppo A16 A

Oppo A16 A

సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్‌, సైడ్ మౌంట్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ బ్యాటరీ ప్రొటెక్షన్‌తో 5వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 13వేల 990

ఒప్పో, అమెజాన్‌ వెబ్‌సైట్లతోపాటు అన్ని ఆఫ్‌లైన్‌ రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. క్రిస్టల్ బ్లాక్‌, పెరల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.