Oppo Pad Air Tablet : ఒప్పో నుంచి కొత్త టాబ్లెట్, వైరల్‌లెస్ ఇయర్‌బడ్స్.. ధర ఎంతంటే?

స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి భారత మార్కెట్లోకి కొత్త టాబ్లెట్, వైర్ లెస్ ఇయర్‌బడ్స్ సెట్ లాంచ్ అయింది. Oppo Reno 8 సిరీస్ ఫోన్‌లతో పాటు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్‌లలోనూ ఇప్పటికే అందుబాటులో వచ్చేశాయి.

Oppo Pad Air Tablet : ఒప్పో నుంచి కొత్త టాబ్లెట్, వైరల్‌లెస్ ఇయర్‌బడ్స్.. ధర ఎంతంటే?

Oppo Pad Air, Oppo Enco X2 Wireless Earbuds Launched In India

Oppo Pad Air Tablet : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి భారత మార్కెట్లోకి కొత్త టాబ్లెట్, వైర్ లెస్ ఇయర్‌బడ్స్ సెట్ లాంచ్ అయింది. అంతేకాదు.. Oppo Reno 8 సిరీస్ ఫోన్‌లతో పాటు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్‌లలోనూ ఇప్పటికే అందుబాటులో వచ్చేశాయి. కొత్త Oppo ప్యాడ్ ఎయిర్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్, 7,100mAh బ్యాటరీ, 10.36-అంగుళాల డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ స్పీకర్లు వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు.. ఇయర్‌బడ్‌లు కొబ్లెస్టోన్ డిజైన్ LHDC 4.0 బ్లూటూత్ కోడెక్ సపోర్ట్‌తో వచ్చాయి. Oppo Enco X2 TWS వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు రూ. 10,000 రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఒప్పో ప్యాడ్ ఎయిర్ రూ. 20వేల ధర పరిధిలో అందుబాటులో ఉంటుంది. ఇయర్‌బడ్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ అవుతాయి. Oppo నుంచి లాంచ్ అయిన కొత్త ప్రొడక్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Oppo ప్యాడ్ ఎయిర్ స్పెసిఫికేషన్లు, ధర ఎంతంటే? :
కొత్తగా లాంచ్ అయిన Oppo ప్యాడ్ ఎయిర్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో వచ్చింది. 6GB LPDDR4xRAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో పాటు మైక్రో SD కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి 512GB వరకు స్టోరేజ్‌తో పెంచుకోవచ్చు. టాబ్లెట్ 2000 x 1200 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు సపోర్టు ఇచ్చే 10.36-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 OS ఆధారంగా ColorOS 12తో వచ్చింది. హుడ్ కింద.. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఉన్న 7,100mAh బ్యాటరీ ఉంది.

Oppo Pad Air, Oppo Enco X2 Wireless Earbuds Launched In India (1)

Oppo Pad Air, Oppo Enco X2 Wireless Earbuds Launched In India 

ఆప్టిక్స్ పరంగా.. మొత్తం 2 కెమెరాలు 1 ముందు, మరొకటి వెనుక ఉన్నాయి. వెనుక వైపు 8-MP సెన్సార్.. ముందు భాగంలో f/2.2 ఎపర్చర్‌తో కూడిన 5-MP కెమెరా ఉంది. కొత్త Oppo టాబ్లెట్ 4 స్పీకర్లను అందిస్తోంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్‌ను అందిస్తాయి. అత్యుత్తమ సౌండ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. Oppo Pad Air భారత మార్కెట్లో రూ. 16,999 ధర ట్యాగ్‌తో వస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ కోసం.. 128GB మోడల్ ధర రూ.19,999లకే సొంతం చేసుకోవచ్చు.

Oppo Enco X2 : స్పెసిఫికేషన్‌లు, ధర ఎంతంటే? :
Oppo నుంచి వచ్చిన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు క్వాడ్ మాగ్నెట్ ప్లానర్ ట్వీటర్స్, అల్ట్రాలైట్ డయాఫ్రాగమ్‌తో కూడిన 11mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి. Dynaudio ట్యూనింగ్‌తో వస్తుంది. SuperDBEE కోక్సియల్ డ్యూయల్-డ్రైవర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. Oppo Enco X2 కొబ్లెస్టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. వైర్‌లెస్ హై‌రెస్ ఆడియో టెక్ అందిస్తున్నాయి. హై క్వాలిటీ ఆడియో ఎక్స్ పీరియన్స్ కోసం LHDC 4.0 బ్లూటూత్ కోడెక్‌కు సపోర్టు అందిస్తోంది. Oppo Enco X2 భారత మార్కెట్లో రూ. 10,999లకు అందుబాటులో ఉంది.

Read Also : Oppo Pad Air : ఒప్పో ఫస్ట్ ప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?