Oppo Reno 8T 5G Launch : 108MP ప్రైమరీ కెమెరాతో ఒప్పో రెనో 8T 5G ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!
Oppo Reno 8T 5G Launch India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో (Oppo) నుంచి సరికొత్త (Oppo Reno 8T 5G) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్‌తో పాటు Enco Air 3 ఇయర్‌బడ్స్ కూడా రిలీజ్ అయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ Reno 8 ఫ్యామిలీతో వచ్చింది.

Oppo Reno 8T 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో (Oppo) నుంచి సరికొత్త (Oppo Reno 8T 5G) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్‌తో పాటు Enco Air 3 ఇయర్‌బడ్స్ కూడా రిలీజ్ అయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ Reno 8 ఫ్యామిలీతో వచ్చింది. ఇప్పటికే రెనో 8 ప్రో సరసమైన కొత్త రెనో 8T భిన్నంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ 108-MP ప్రైమరీతో పాటు 4,800mAh బ్యాటరీతో వస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.
ఈ డివైజ్‌ను సన్‌రైజ్ గోల్డ్, మిడ్‌నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. Enco Air 3 TWS ఇయర్‌బడ్‌ల విషయానికొస్తే.. గత వెర్షన్లతో పోల్చినప్పుడు కొన్ని డిజైన్ మార్పులు ఉన్నాయి. ఈ ఏడాదిలో Enco ఎయిర్ 3 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ (IP54) రెండింటినీ కలిగి ఉంది. ప్రతి బడ్ బరువు 3.7 గ్రాములు, ఎన్‌కో ఎయిర్ 2 ఇయర్‌బడ్‌ల కన్నా కొంచెం బరువుగా ఉంటుంది.

Oppo Reno 8T 5G and Enco Air 3 launched in India _ Price, specs and all you need to know
ఒప్పో రెనో 8T ఫోన్, Enco Air 3 ధరలివే :
Oppo Reno 8T ఫోన్ భారత మార్కెట్లో సింగిల్ 8GB RAM,128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 29,999 ఉండనుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అధికారిక Oppo ఛానెల్‌లలో ప్రీ-ఆర్డర్ సేల్ అందుబాటులో ఉంది. Enco Air 3 విషయానికొస్తే.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ (Amazon), ఒప్పో (Oppo) స్టోర్‌లలో ఇయర్‌బడ్స్ రూ. 2,999కి అందుబాటులో ఉంటాయి. రెండు డివైజ్‌లు ఫిబ్రవరి 10, 2023 నుంచి సేల్ అందుబాటులోకి రానున్నాయి.
Oppo Reno 8T స్పెసిఫికేషన్స్ :
ఒప్పో రెనో 8T మైక్రో-కర్వ్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బరువు కేవలం 171 గ్రాములు, 7.7mm స్లిమ్‌గా ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఎలివేటెడ్ డ్యూయల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. డెకరేటివ్ రౌండ్ స్ట్రిప్ ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 10-బిట్ కలర్ డెప్త్‌ను కలిగి ఉంది. 1.07 బిలియన్ కలర్లతో కలిగి ఉంటుంది. 6.7-అంగుళాల AMOLED స్క్రీన్ Dragontrail-Star2 ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. 108-MP ప్రైమరీ కెమెరా, ఇతర కెమెరా సెన్సార్‌లతో పాటు ఫ్రంట్ కెమెరా 32-MP వివిధ ఫీచర్లతో వస్తుంది.

Oppo Reno 8T 5G and Enco Air 3 launched in India
దాంతో పాటు, Oppo Reno 8T 5G Qualcomm Snapdragon 695 5G SoC ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ 8GB RAMతో వస్తుంది. డివైస్ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ నుంచి ర్యామ్‌ను తీసుకునే Oppo RAM విస్తరణ టెక్నాలజీని అందిస్తుంది. ఈ డివైజ్‌ను RAMని మరో 8GB వరకు పొడిగించవచ్చు. అంతేకాదు.. డివైజ్ ColorOS 13లో రన్ అవుతుంది.18 యాప్‌లను లాగ్ లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. ఈ ఫోన్ 4,800mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. Oppo Reno 8T 5G గరిష్టంగా 128GB స్టోరేజీతో వస్తుంది.
Oppo Enco Air 3 స్పెసిఫికేషన్స్ :
ఒప్పో Enco Air 3 మోడల్ ధరల రేంజ్‌లో హై-పర్ఫార్మెన్స్ DSP మాడ్యూల్‌ను అందిస్తుంది. ఫస్ట్ ఇయర్‌బడ్‌లలో Oppo Enco Air 3 35 శాతం ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. 50 శాతం ఎక్కువ బ్యాటరీ లైఫ్, అద్భుతమైన సౌండ్ కలిగి ఉందని పేర్కొంది. వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు పవర్‌ఫుల్ బాస్, 13.4mm డ్రైవర్‌లను అందిస్తాయి. ఇయర్‌బడ్‌లు ఒకే ఛార్జ్‌పై 6 గంటల వరకు పనిచేస్తాయని కేస్‌తో 25 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ ఉంటుందని Oppo పేర్కొంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Oppo A78 5G Launch : ఈ నెల 16న ఒప్పో A78 5G ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?